AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైట్ అండ్ వైట్‌కు గుడ్ బై.. ట్రెండీ లుక్‌లో సీఎం విజయ్..ఈ డ్రెస్‌కొడ్‌ వెనుక అసలు రహస్యం?

తెల్ల చొక్కా, అంచున్న తెల్ల పంచె.. ఇదే తమిళ రాజకీయాల్లో ముఖ్యమంత్రులు దశాబ్ధాలుకు ధరిస్తున్న డ్రెస్‌ కోడ్.. కానీ ఇప్పుడక్కడ సీన్ మారింది. తమిళ రాజకీయాల్లో సంచలన సృష్టించిన సినీ హీరో, టీవీకే చీఫ్‌ విజయ్ ఈ పంచె కట్టు సాంప్రదాయాన్ని పక్కన పెట్టి.. సూటుబూటుతో ట్రెండి లుక్‌లో కనిపించి అందనిరి ఆశ్చర్యానికి గురి చేశాడు. పాత తరం నేతలకు ఇది ఆశ్చర్యమైతే.. యువతకు మాత్రం ఇదో కొత్త కిక్ ఇస్తోంది.

వైట్ అండ్ వైట్‌కు గుడ్ బై.. ట్రెండీ లుక్‌లో సీఎం విజయ్..ఈ డ్రెస్‌కొడ్‌ వెనుక అసలు రహస్యం?
Thalapathy Vijay Cm Dress Code
Ch Murali
| Edited By: |

Updated on: May 13, 2026 | 8:19 AM

Share

తమిళనాట నాయకుల నుంచి సామాన్యుల వరకు డ్రెస్ కోడ్ ప్రత్యేకంగా ఉంటుంది. తెల్ల చొక్కా, తెల్ల పంచె.. వైట్ అండ్ వైట్ డ్రెస్ కోడ్ అనేది తమిళనాడులో సర్వసాధారణం. రాజకీయ నాయకుల్లో అయితే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకులు వైట్ అండ్ వైట్ లో ఉండటమనేది ఒక ఆనవాయితీగా ఉండేది. కామరాజర్‌తో మొదలై అన్నాదురై నుంచి పళనిస్వామి, మాజీ సీఎం స్టాలిన్ వరకు అదే తెల్ల చొక్కా, అదే తెల్ల పంచె డ్రెస్‌కోడ్‌ను కొనసాగించారు. దేశంలో ఇలాంటి డ్రెస్ కోడ్ కేవలం తమిళనాడులో మాత్రమే కనిపిస్తుంది. కేరళలో మాత్రం పంచె కట్టు కామన్‌గా ఉన్నా, చొక్కా రంగులు మాత్రం మారుతుంటాయి.

తమిళనాడులో అయితే తెల్ల పంచెకు ఆయా పార్టీల జెండాలోని రంగుల బోర్డర్ లైన్స్‌తో పంచెలు దుకాణాల్లో అందుబాటులో ఉంటాయి. డీఎంకే  పార్టీకి సంబంధించిన నేతలు ఎరుపు, నలుపు బోర్డర్ కలిగిన పంచెలను ధరిస్తే. అన్నా డీఎంకే నేతలు ఎరుపు, మధ్యలో తెలుపు, తర్వాత నలుపు బోర్డర్ కలిగిన పంచెలను ధరిస్తుంటారు. ప్రతి పార్టీ గుర్తులను బట్టి ఆయా రంగులతో పంచెలు మార్కెట్లో లభిస్తుంటాయి.

విజయ్ మార్క్‌

కానీ తాజాగా 2026లో జరిగిన ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే చీఫ్‌ విజయ్ ఈ సాంప్రదాయ దుస్తులకు చెక్‌ పెడుతూ కొత్త డ్రెస్ కోడ్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఎన్నికల ప్రచారంలో లైట్ బ్రౌన్ కలర్ ప్యాంట్, తెల్ల చొక్కా ధరించి వెరైటీగా కనిపించారు. అప్పట్లో విజయ్ డ్రెస్ కోడ్‌ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ డ్రెస్ కోడ్‌తో పోల్చారు. ఇక సీఎం విజయ్ మరో అడుగు ముందుకు వేసి ప్యాంటు, షర్టు పైన నల్ల కోటు ధరించి కొత్త లుక్‌లో కనిపించారు.

అభిమానుల ఆనందం

ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ కొత్త డ్రెస్ కోడ్‌లో విజయ్‌ను చూసిన అభిమానులు ఆనందంతో కేకలు వేశారు. ఇప్పటిదాకా తమిళనాడులో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి డ్రెస్ కోడ్‌లో కనిపించలేదు. అందరూ పంచె కట్టు, తెల్ల చొక్కా ధరించి ఒకే మూసలో ఉండగా.. విజయ్ లుక్ యువతకు, ప్రజలకు కొత్తగా అనిపించింది. దీనిపై సోషల్ మీడియాలో కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ నటించిన సర్కార్ సినిమాలో కూడా ప్రస్తుతం సీఎం హోదాలో ఉన్న డ్రెస్ కోడ్‌లోనే కనిపించిన విషయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం