కరోనాకు ’వరల్డ్ ఫేమస్ లవర్‘ చిట్కాలు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హీరో విజయ్ దేవరకొండ ముందుకొచ్చాడు...

కరోనాకు ’వరల్డ్ ఫేమస్ లవర్‘ చిట్కాలు

Updated on: Mar 11, 2020 | 8:53 AM

ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తుంది కరోనా వైరస్.. ఎక్కడో చైనాలోని వుహన్‌లో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ నలుమూలలకి వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకి గురి చేస్తుంది. ఇక భారత్ లోకి ప్రవేశించి క్రమక్రమంగా ఈ వ్యాది విస్తరిస్తుంది. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 59కి చేరుకున్నాయి. కేరళలో ఒక్కరోజే ఆరు పాజిటివ్ కేసులు నమోదు కాగా, కర్ణాటకలో మూడు కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణాలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయ్యింది.

మహమ్మారి కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ కనుగోనే ప్రక్రియ మరింత ఆలస్యం అవుతున్నందున.. మందులేని ఈ వ్యాధికి…నివారణ ఒక్కటే మార్గంగా భావించాయి ప్రభుత్వాలు. ఇందులో భాగంగా అనేక విధాలుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే…ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హీరో విజయ్ దేవరకొండ ముందుకొచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం విజరుతో కలిసి ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో కరోనా వైరస్‌ పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు విజయ్. షేక్‌ హ్యాండ్‌లు వద్దు.. పద్ధతిగా నమస్కారం పెట్టు…అని చెప్పాడు. ఎవరైనా దగ్గుతూ, తుమ్ముతూ ఉంటే వారికి మూడగుల దూరంగా ఉండాలని సూచించాడు. ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలలో తిరగకపోవడమే మంచిదన్నారు. అంతేకాకుండా వ్యాధి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్టు అనిపిస్తే 104కి కాల్‌ చేసి, డాక్టర్‌ని సంప్రదించాలని విజయ్ దేవరకొండ కోరాడు.