Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ఇంటి పునర్నిర్మాణం కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా?.. బయటపడ్డ షాకింగ్ విషయాలు

|

May 26, 2023 | 6:24 PM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇంటి ఆధునికీకరణ కోసం నిబంధనలకు విరుద్ధంగా అధికంగా ఖర్చు చేశారని ఇటీవల బీజేపీ ఆరోపించింది. దీనిపై మీడియాలో కూడా కథనాలు రావడంతో విచారణ జరిపించి వెంటనే వాస్తవ నివేదికను సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. అయితే దీనిపై విచారణ జరిపిన అనంతరం.. సీఎం కేజ్రీవాల్ ఇంటి ఆధునికీకరణకు రూ.52.71 కోట్లు ఖర్చు చేసినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఢిల్లీ విజిలెన్స్ డైరెక్టరేట్ […]

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ఇంటి పునర్నిర్మాణం కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా?.. బయటపడ్డ షాకింగ్ విషయాలు
Arvind Kejriwal
Follow us on

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇంటి ఆధునికీకరణ కోసం నిబంధనలకు విరుద్ధంగా అధికంగా ఖర్చు చేశారని ఇటీవల బీజేపీ ఆరోపించింది. దీనిపై మీడియాలో కూడా కథనాలు రావడంతో విచారణ జరిపించి వెంటనే వాస్తవ నివేదికను సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. అయితే దీనిపై విచారణ జరిపిన అనంతరం.. సీఎం కేజ్రీవాల్ ఇంటి ఆధునికీకరణకు రూ.52.71 కోట్లు ఖర్చు చేసినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఢిల్లీ విజిలెన్స్ డైరెక్టరేట్ నివేదిక సమర్పించింది. ఇందులో రూ.33.49 కోట్లను ఇంటి నిర్మాణానికి, రూ.19.22 కోట్లను క్యాంపు కార్యాలయ నిర్మాణానికి ఖర్చు చేసినట్లు తెలిపింది.

అయితే ఈ నివేదిక ప్రకారం.. మొదటగా రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లతో పనులను పూర్తి చేయాలని అంచనా వేసిన ప్రజాపనుల విభాగం రూ.8.61 కోట్లకు టెండర్లను పిలిచింది. 2020లో పనులను అప్పగించింది. పనులు మొదలయ్యాక పలు కొత్త ప్రతిపాదనలు చేయడం, అదనపు హంగులు తోడవడంతో అంచనా పెరుగుతూపోయింది. అయితే మొదట్లో ఉన్న ఇంటినే ఆధునికీకరించాలని అనుకున్నారు. కాని అది 1942-43 కాలంలో కట్టారు. దీంతో దాన్ని పూర్తిగా తొలగించి నిర్మించాల్సి వచ్చిందని ప్రజాపనుల విభాగం తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..