AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: టోల్ ప్లాజా వద్ద గ్యాస్ ట్యాంకర్ బ్లాస్ట్.. సెకన్లలో సర్వనాశనం! సీసీటీవీలో భయానక దృశ్యాలు!

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. కోఖ్రాజ్ టోల్ ప్లాజా సమీపంలో ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా క్షణాల వ్యవధిలోనే భారీ అగ్నిగోళంగా మారింది. ఈ భయానక దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో ప్రత్యక్షంగా రికార్డయ్యాయి.

Viral Video: టోల్ ప్లాజా వద్ద గ్యాస్ ట్యాంకర్ బ్లాస్ట్.. సెకన్లలో సర్వనాశనం! సీసీటీవీలో  భయానక దృశ్యాలు!
Lpg Tanker Crash At Up Toll Plaza
Balaraju Goud
|

Updated on: Jul 03, 2026 | 11:58 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. కోఖ్రాజ్ టోల్ ప్లాజా సమీపంలో ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా క్షణాల వ్యవధిలోనే భారీ అగ్నిగోళంగా మారింది. ఈ భయానక దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో ప్రత్యక్షంగా రికార్డయ్యాయి.

అధికారుల కథనం ప్రకారం.. వేగంగా వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ నియంత్రణ కోల్పోయి టోల్ ప్లాజా వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకై, కేవలం కొన్ని సెకన్లలోనే ఆకాశమంత ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు ధాటికి టోల్ ప్లాజా కేబిన్లు, సమీపంలో ఉన్న వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో టోల్ సిబ్బందితో పాటు ప్రయాణికులు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో హైవేపై ట్రాఫిక్‌ను నిలిపివేసి, గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘోర ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి…

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ ఫైట్
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ ఫైట్
ఆ సినిమా రిలీజ్ చేసి పెద్ద తప్పు చేశా..
ఆ సినిమా రిలీజ్ చేసి పెద్ద తప్పు చేశా..
పుంగనూరు జాతి ఆవులు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
పుంగనూరు జాతి ఆవులు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
తల్లిదండ్రులు చేసే ఈ చిన్న పొరపాటుతో పిల్లల ప్రాణాలకే ముప్పు..
తల్లిదండ్రులు చేసే ఈ చిన్న పొరపాటుతో పిల్లల ప్రాణాలకే ముప్పు..
టోల్ ప్లాజా వద్ద కళ్ల ముందే కాలిపోయిన గ్యాస్ ట్యాంకర్!
టోల్ ప్లాజా వద్ద కళ్ల ముందే కాలిపోయిన గ్యాస్ ట్యాంకర్!
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి
వందేళ్ల వరద వచ్చినా నో టెన్షన్..! మూసీ నదిపై భారీ ప్లాన్!
వందేళ్ల వరద వచ్చినా నో టెన్షన్..! మూసీ నదిపై భారీ ప్లాన్!
పాము పిల్ల గురించి ఈ నిజాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
పాము పిల్ల గురించి ఈ నిజాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ఊహించని ట్విస్టులు.. మైండ్ బ్లాంక్ అయ్యే సస్పెన్స్.
ఊహించని ట్విస్టులు.. మైండ్ బ్లాంక్ అయ్యే సస్పెన్స్.
ఉద్యోగం పోతే ఎలా? నో టెన్షన్‌.. కుటుంబ ఖర్చుల కోసం 4 పనులు చేయండి
ఉద్యోగం పోతే ఎలా? నో టెన్షన్‌.. కుటుంబ ఖర్చుల కోసం 4 పనులు చేయండి