Madhya Pradesh: గుండెలను పిండేసే వీడియో! భుజాలపై చిన్నారి మృతదేహంతో అందరితోపాటే బస్సులో ప్రయాణం

|

Oct 20, 2022 | 1:19 PM

మధ్యప్రదేశ్ మరో హృదవిదాకర ఘటన వెలుగులోకి వచ్చింది. కనీస సదుపాయాలు అందక పేదలు, మారుమూల పల్లెవాసులు నరకం అనుభవిస్తున్నారు. కనీసం చనిపోయినవారిని సొంతూళ్లకు తీసుకుపోలేని దుస్థితి. ఇందుకు నిదర్శనమే తాజా ఘటన..

Madhya Pradesh: గుండెలను పిండేసే వీడియో! భుజాలపై చిన్నారి మృతదేహంతో అందరితోపాటే బస్సులో ప్రయాణం
Man Carries Niece's Body on Shoulders in MP
Follow us on

మధ్యప్రదేశ్ మరో హృదవిదాకర ఘటన వెలుగులోకి వచ్చింది. కనీస సదుపాయాలు అందక పేదలు, మారుమూల పల్లెవాసులు నరకం అనుభవిస్తున్నారు. కనీసం చనిపోయినవారిని సొంతూళ్లకు తీసుకుపోలేని దుస్థితి. ఇందుకు నిదర్శనమే తాజా ఘటన. ఓ వ్యక్తి నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని మోసుకుంటూ బస్టాండ్‌ వరకూ వెళ్లాడు. తన ఊరు చేరుకోవడానికి ఇతర ప్రయాణికుల మాదిరిగానే బస్సులో ప్రయాణించాడు. మృతదేహంతోపాటుగా అతడు నడుచుకుంటూ వెళ్తోన్న దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

మధ్యప్రదేశ్‌లో నాలుగేళ్ల చిన్నారి తన స్వగ్రామంలో ప్రమాదవశాత్తూ మృతి చెందింది. దీంతో పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఛాతర్‌పుర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, తిరిగివచ్చే సమయంలో చిన్నారి సమీపబంధువు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. మృతదేహాన్ని తరలించడానికి ఆసుపత్రి వద్ద ఎటువంటి ప్రభుత్వ వాహనం అందుబాటులో లేదు. మరోపక్క ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే.. వేలల్లో డబ్బులు డిమాండ్ చేశారు. చేసేదీలేక సరిపడా డబ్బులు లేక.. చిన్నారి మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ బస్టాండ్‌కు వెళ్లాడు ఆ వ్యక్తి. అందరి ప్రయాణికులతో పాటే తన ఊరు వెళ్లే బస్సు ఎక్కాడు. టికెట్‌ కొనేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో తోటి ప్రయాణికుడు ఒకరు సహాయం చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూసిన నెటిజన్లు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని ప్రభుత్వం ఉన్నా.. లేకున్నా.. ఒకటేనంటూ కామెంట్ సెక్షన్లో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.