Vice Presidential Election: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్‌ అల్వా.. ఖరారు చేసిన శరద్‌పవార్‌

Vice Presidential Election 2022: భారత ఉపరాష్ట్రపతి పదవికి గానూ విపక్షాల అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్‌ అల్వా బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు నేషనల్ కాంగ్రెస్ పార్టీ(NCP) చీఫ్ శరద్ పవార్ ఆదివారం మార్గరెట్‌ అల్వా పేరును ఖరారు చేశారు

Vice Presidential Election: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్‌ అల్వా.. ఖరారు చేసిన శరద్‌పవార్‌
Margaret Alva
Follow us

|

Updated on: Jul 17, 2022 | 5:17 PM

Vice Presidential Election 2022: భారత ఉపరాష్ట్రపతి పదవికి గానూ విపక్షాల అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్‌ అల్వా బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు నేషనల్ కాంగ్రెస్ పార్టీ(NCP) చీఫ్ శరద్ పవార్ ఆదివారం మార్గరెట్‌ అల్వా పేరును ఖరారు చేశారు. కాగా కర్టాటకకు చెందిన మార్గెరెట్‌ అల్వా గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా గోవా, గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా ఆదివారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ ‘ మొత్తం 17 పార్టీలు ఏకాభిప్రాయంతో మార్గరెట్ అల్వాను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాం. ఆమె మంగళవారం నామినేషన్ దాఖలు చేస్తారు’  అని చెప్పుకొచ్చారు.  కాగా ఈ ఎన్నికల్లో జగదీప్‌ ధనకర్‌ను ఎన్టీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోస ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు శరద్ పవార్ అధ్యక్షతన విపక్షాల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, లెఫ్ట్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సహా అన్ని ప్రధాన ప్రతిపక్షాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా రాష్ట్రపతి ఎన్నికల మాదిరిగా కాకుండా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో  ఎన్డీయే అభ్యర్థి పేరును ప్రకటించే వరకు వేచి  వేచి ఉండాలని విపక్షాలు భావించాయి.  వాస్తవానికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రకటించకముందే ప్రతిపక్షాలు యశ్వంత్ సిన్హాను తమ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా జులై 19తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయవార్తల కోసం క్లిక్ చేయండి..

మార్కెట్‌లో సూపర్ ఫీచర్స్‌తో సరికొత్త ఈవీ లాంచ్..!
మార్కెట్‌లో సూపర్ ఫీచర్స్‌తో సరికొత్త ఈవీ లాంచ్..!
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ