Vice President Election: తెలుగు వర్సెస్ తంబి .. ఉపరాష్ట్రపతి పోరులో ఉత్కంఠరేపే అంశాలెన్నో…!
1998లో కోయంబత్తూర్‌లో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. 85 మంది చనిపోయారు ఆ దుర్ఘటనలో. పైగా లాల్‌కృష్ణ అద్వాణీ అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ అది. బట్.. బాంబ్ బ్లాస్ట్ టార్గెట్ ఎల్‌కే అద్వాణీ మాత్రమే కాదు. సీపీ రాధాకృష్ణన్. తమిళనాట బీజేపీకి బలమైన పునాదులు వేస్తున్నందుకు జరిగిన అటాక్ అది. తమిళనాడులో బీజేపీ అంటే రాధాకృష్ణన్, రాధాకృష్ణన్ అంటే బీజేపీ అనేంత ఫేమస్. ఈయనే ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే తరపున పోటీలో ఉన్న అభ్యర్ధి. ఇక 2013లో జరిగిన ఒక రియల్ స్టోరీ చెప్పుకోవాలి. లోకాయుక్త పదవిలో ఆయనే ఉండాలంటూ ఏరికోరి మరీ జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని తీసుకొచ్చుకున్నారు అప్పటి గోవా సీఎం పారికర్. ఆ పదవి స్వీకరిస్తా గానీ ముఖ్యమంత్రిని సైతం ప్రశ్నించే అధికారం లోకాయుక్తకు ఇస్తేనే వస్తానన్నారు జస్టిస్ సుదర్శన్. ఆ కండీషన్‌కు సీఎం ఒప్పుకున్నారు కూడా. అలా లోకాయుక్తగా కూర్చున్న తొలి కేసులోనే.. అదే గోవా సీఎం పారికర్‌ను విచారణకు పిలిపించారు. ఇదీ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఇండీ కూటమి తరపున పోటీలో ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి ముక్కుసూటితనం. అందుకే, ఈ పోటీలో ఎవరి బలం ఎంత, ఎవరు గెలుస్తారనే చర్చ కంటే.. వాళ్లు ఎలాంటి వ్యక్తులు అని తెలుసుకోవడమే మోస్ట్ ఇంట్రస్టింగ్. పైగా.. రాజకీయ పార్టీలకూ అగ్నిపరీక్షే. అన్ని పార్టీలకు ఇద్దరిపైనా మంచి అభిప్రాయం ఉంది. మరి.. ఎవరెటు ఓటు వేస్తారు?

ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమే అనుకున్నారంతా. ఈసారి పోటీ వద్దు, రాధాకృష్ణన్‌కే మద్దతివ్వండని విపక్షాలను స్వయంగా రిక్వెస్ట్ చేశారు ప్రధాని మోదీ. బట్.. అలా విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల్లోనే జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించింది ఇండీ కూటమి. రాధాకృష్ణన్ తమిళ్ కాబట్టి విపక్ష కూటమి కూడా తమిళ వ్యక్తినే ప్రతిపాదిస్తుందనుకున్నారు. బట్.. ఊహించని రీతిలో తెలుగు వ్యక్తి పేరు ప్రకటించారు. సో, ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు సౌత్‌ఇండియా పాలిటిక్స్‌గా మారాయి. అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు వర్సెస్ తమిళ్ అనేలా మారింది ప్రస్తుత పోటీ. ఉపరాష్ట్రపతి ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో కచ్చితంగా రసవత్తరమే. ఎన్డీయే కూటమి తమిళ కార్డు ప్రయోగిస్తే.. ఇండీ కూటమి తెలుగు కార్డు ప్రయోగించి ఇక్కడి రాజకీయ పార్టీలను ఇరుకున పెట్టింది. టీడీపీ ఎన్డీయేలో బలమైన భాగస్వామే కావొచ్చు. కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కాబట్టి ఆ కూటమి అభ్యర్ధికే మద్దతివ్వొచ్చు. అలాగని.. ఇండీ కూటమి అభ్యర్ధికి మద్దతివ్వకపోవడానికి కారణం చెప్పాలిగా. పైగా ఇక్కడ పోటీ చేస్తున్నది ఓ తెలుగు వ్యక్తి. పార్టీ పేరులోనే తెలుగుదేశం అని ఉంది కాబట్టి.. ఉపరాష్ట్రపతి పదవికి జరిగే పోటీలో తెలుగు అభ్యర్ధి అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని పేరుపేరునా విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్లే బైట్ః రేవంత్‌రెడ్డి అటు.. వైసీపీకి కూడా ఇది పెద్ద పరీక్షే. తెలుగు వ్యక్తికి మద్దతివ్వాలా లేక ఎన్డీయే అభ్యర్ధికా అనేది తేల్చుకోవాల్సిన సమయం. ఎంతైనా తెలుగు వ్యక్తి కదా అని వైసీపీ...




