Indian Railways: కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం.. సరికాదంటూ బీజేపీ ఎంపీ అభ్యంతరం

|

Jul 22, 2022 | 3:13 PM

Indian Railways: ప్రయాణీకులకు అందిస్తున్న రాయితీలు రైల్వే శాఖ పాలిట భారంగా మారుతోందని.. రైల్వే మంత్రిత్వ శాఖ(Railway Ministry) ఇటీవల పార్లమెంటుకు తెలియజేసింది. కోవిడ్ పాండమిక్ ముందు వరకు కల్పిస్తూ వచ్చిన రాయితీలను అన్ని వర్గాలకు పునరుద్ధరించలేమని స్పష్టంచేసింది. 

Indian Railways: కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం.. సరికాదంటూ బీజేపీ ఎంపీ అభ్యంతరం
Indian Railways
Follow us on

Indian Railways: రైల్వే టికెట్లలో సీనియర్ సిటిజన్లకు కల్పిస్తున్న రాయితీని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రయాణీకులకు అందిస్తున్న రాయితీలు రైల్వే శాఖ పాలిట భారంగా మారుతోందని.. రైల్వే మంత్రిత్వ శాఖ(Railway Ministry) ఇటీవల పార్లమెంటుకు తెలియజేసింది. కోవిడ్ పాండమిక్ ముందు వరకు కల్పిస్తూ వచ్చిన రాయితీలను అన్ని వర్గాలకు పునరుద్ధరించలేమని స్పష్టంచేసింది.  దీనికి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశమున్నట్లు సమాచారం. సీనియర్ సిటిజన్ల రాయితీలను ఉపసంహరించుకోవాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు వెలువడిన కథనాలపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ(MP Varun Gandhi) స్పందించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన తప్పుబట్టారు. సీనియర్ సిటిజన్ ప్రయాణీకులకు రైల్వే టికెట్లలో కల్పిస్తున్న రాయితీలను ఉపసంహరించుకోవాలన్న ప్రభుత్వ ఆలోచన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సీనియర్ సిటిజన్లకు కల్పిస్తున్న రాయితీని భారంగా పరిగణించకూడదన్నారు. రైల్వే టికెట్లలో ఎంపీలకు రాయితీ కల్పి్స్తున్నారని.. మరి వారికి లేని అభ్యంతరం సీనియర్ సిటిజన్లకు ఎందుకని ప్రశ్నించారు. ఈ విషయంలో  కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని వరుణ్ గాంధీ సూచించారు. మన సొంత ప్రజలకు ఇస్తున్న రాయితీలను ఈ వయస్సులో అలా ఉపసంహరించుకోవడం సరికాదని వరుణ్ గాంధీ వ్యాఖ్యానించారు.

కరోనా పాండమిక్ మునుపటి వరకు మహిళా సీనియర్ సిటిజన్ ప్రయాణికులకు రైల్వే శాఖ అన్ని క్లాస్‌లలోనూ 50 శాతం రాయితీ కల్పించగా.. పురుషులు, ట్రాన్స్‌జెండర్లకు 40 శాతం రాయితీ కల్పించింది. సీనియర్ సిటిజన్ రాయితీని పొందేందుకు మహిళలకు కనీస వయో పరిమితి 58 ఏళ్లు కాగా, పురుషులకు 60 ఏళ్లుగా ఉండేది.

భారతీయ రైల్వే ప్రయాణ ఖర్చులో 50 శాతానికి పైగా రాయితీలను భరిస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల లోక్‌సభకు లిఖిత పూర్వకంగా తెలిపారు. 2017-18, 2018-19, 2019-20 సంవత్సరాల్లో రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీల్లో సీనియర్ సిటిజన్ ప్రయాణికుల ఛార్జీలలో రాయితీల కారణంగా రైల్వే శాఖ రూ. 4,794 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..