Varavara Rao Bail: విరసం నేత వరవరరావు విడుదలకు లైన్ క్లియర్ అయింది. 2016 నాటి సుర్జాఘర్ మైన్స్‌కు చెందిన వాహనాల తగులబెట్టిన కేసులో ఆయనకు ముంబై హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వరవరరావు అనారోగ్య కారణాల వల్ల బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. 2016 డిసెంబర్ 25న గడ్చిరోలిలోని ఎటపల్లి తాలుకాలో సూర్జాఘర్ మైన్స్‌కు చెందిన 80 వాహనాలను నక్సల్స్ తగులబెట్టారు. ఈ కేసులో వరవరరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే బీమా కోరేగావ్‌కేసులో బాంబే హైకోర్టు ఆయనకు సోమవారం ఆరు నెలల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తాజాగా వాహనాలను తగులబెట్టిన కేసులోనూ బెయిల్ మంజూరైన నేపథ్యంలో వరవరరావు విడులయ్యేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: Kuppam TDP: రాజీనామా బాటలో కుప్పం తెలుగు తమ్ముళ్లు.. అధినేత ఇలాఖాలోనే గెలవలేకపోయామని ఆవేదన