Vande Bharat Train: 180 కి.మీల వేగంతో దూసుకుపోతున్న వందేభారత్‌ రైలు.. ఔరా అనిపిస్తోన్న ట్రయల్‌ రన్‌ వీడియో..

|

Aug 27, 2022 | 3:00 PM

Indian Railway: అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకునే క్రమంలో ఇండియన్‌ రైల్వేస్‌ హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశ పెడుతోన్న విషయం తెలిసిందే. వందేభారత్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ట్రైన్స్‌ను తొలిసారి 2019లో అందుబాటులోకి తీసుకొచ్చారు...

Vande Bharat Train: 180 కి.మీల వేగంతో దూసుకుపోతున్న వందేభారత్‌ రైలు.. ఔరా అనిపిస్తోన్న ట్రయల్‌ రన్‌ వీడియో..
Vande Bharat Train
Follow us on

Indian Railway: అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకునే క్రమంలో ఇండియన్‌ రైల్వేస్‌ హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశ పెడుతోన్న విషయం తెలిసిందే. వందేభారత్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ట్రైన్స్‌ను తొలిసారి 2019లో అందుబాటులోకి తీసుకొచ్చారు. న్యూఢిల్లీ-వారణాసి మార్గంలో వందేభారత్‌ రైలును తొలుత ప్రారంభించారు. తాజాగా ఢిల్లీ నుంచి వైష్ణోదేవీ మార్గంలో రెండో వందేభారత్‌ రైలును ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా కోటా నుంచి నగ్దా సెక్షన్‌లో ట్రయల్‌ రన్‌ను నిర్వహించారు. గంటకు 180 కిలోమీటర్ల గరిష్ణ వేగాన్ని అందుకున్న వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ట్విట్‌ చేశారు.

ప్రస్తుతం ఈ రైలు వీడియోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. రైలు గంటకు 180 కి.మీల వేగాన్ని అందుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే స్మార్ట్‌ ఫోన్‌లో స్పీడ్‌ మీటర్‌తో పాటు పక్కన ఓ గ్లాసులో చివరి వరకు నీటిని ఉంచారు. రైలు అంత వేగంతో వెళ్తున్నా నీరు కుదుపులకు లోనుకాకపోవడం విశేషం. వందేభారత్‌ రైళ్లు విజయవంతంగా ట్రయల్‌ రన్‌ పూర్తి చేసుకోవడంతో ఇలాంటి ట్రైన్స్‌ను మరికొన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇండియన్‌ రైల్వే ప్రణాళికలు రచిస్తోంది. రానున్న మూడేళ్లలో 400 వందే భారత్‌ రైళ్లను తీసుకురానున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..