
ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ పనులు మళ్లీ ఆగిపోయాయి. ఈసారి ఐరన్ మెష్ వల్ల డ్రిల్లింగ్ మెషీన్ పాడుకావడంతో రెస్క్యూ ఆపేశారు అధికారులు. దీంతో నిన్ననే బయటకు వస్తారనుకున్న ఆ 41మంది మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును టన్నెల్‌లో ఉన్నవారిని రక్షించే ప్రయత్నాలు మళ్లీ ఆగిపోయాయి. దాదాపు రెండు వారాలవుతున్నా.. కార్మికులంతా టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు. గురువారం సాయంత్రానికి అందర్నీ రక్షిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే అది కుదరలేదు. నవంబర్ 12న ఉత్తరాఖండ్‌లోని సిల్క్‌యారా దగ్గర సొరంగ మార్గం పనుల్లో ఒక్కసారిగా అలజడి నెలకొంది. టన్నెల్‌లో కొండచరియలు విరిగిపడడంతో.. 41మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. ఓ వైపు సొంరంగం తవ్వాల్సి ఉండగా.. మరోవైపు సొరంగం పూడుకు పోయింది. దీంతో గుహలోనే కార్మికులంతా చిక్కుకుపోయారు. 13 రోజులుగా అందులోనే ఉండిపోయారు. అప్పటి నుంచి వారిని రక్షించేపనులు జోరుగా కొనసాగుతున్నాయి.
ఎన్డీఆర్‌ఎఫ్ రెండ్రోజుల క్రితం టన్నెల్ లో చిక్కుకున్నవారిని వెలుపలికి తీసుకొచ్చే ప్లాన్స్‌ను పక్కాగా అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. దాదాపు వారికి దగ్గరగా వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్.. ఆ సొరంగంలోనే.. మరో చిన్న సొరంగాన్ని తవ్వి కార్మికులు ఒక్కొక్కర్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే చిన్న సొరంగాన్ని డ్రిల్ చేస్తున్న సమయంలో.. మిషనరీ ఓ ఇనుమ మెష్‌లోకి దూసుకెళ్లింది. నిజానికి ఈ ఐరన్ లాటిస్ గిర్డర్‌ని డ్రిల్లింగ్ మెషీన్ల ద్వారా తీయాలని చూస్తే.. పెను ప్రమాదం తప్పదు. ఇప్పుడు రక్షించే పనులకు తోడు.. మరింత ప్రమాదంలోకి కార్మికులను నెట్టే అవకాశాలుండడంతో.. అక్కడితో రెస్క్యూ పనులను ఆపేశారు.
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Late night visuals from outside the tunnel
Drilling work was halted after a technical snag in the Auger drilling machine. Till now, rescuers have drilled up to 46.8 meters in the Silkyara tunnel pic.twitter.com/EqwoifaQsT
— ANI (@ANI) November 23, 2023
నిజానికి గురువారం సాయంత్రమే వారిని బటయకు తీయాల్సి ఉంది కాని.. ఈ ఐరన్ గిర్డర్ అడ్డురావడంతో.. రెండు మీటర్లలోతు వరకే తవ్వగలిగారు. ఆతర్వాత డ్రిల్లింగ్ మెషీన్ ఐరన్ గిర్డర్‌లోకి వెళ్లి ఆగిపోయింది. దీన్ని తిరిగి బాగుచేయాలంటే ఒకరోజు పడుతుందని టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఈ ఇనుప మెష్‌ను కేవలం వెల్డింగ్ ద్వారానే బయటకు తీయగలుగుతారు కాని.. ఇలా డ్రిల్లింగ్‌తో సాధ్యం కాదని ఎన్డీఆర్‌ఎఫ్ ప్రకటించింది. దీంతో కార్మికులను బయటకు తీసుకొద్దామనుకున్న పనులకు మరోసారి ఆటంకం కలిగింది.
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Food being packed for the 41 workers who are trapped inside pic.twitter.com/jQAOEyvjiw
— ANI (@ANI) November 24, 2023
మరోవైపు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి టన్నెల్ దగ్గరే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయన గురువారం రాత్రి కూడా టన్నెల్ దగ్గరే మకాం వేశారు. పనులు వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఎప్పటికపుడు టన్నెల్‌లోని కార్మికులతో వాకీటాకీల సాయంతో మాట్లాడుతూ వారిలో ధైర్యం నింపుతున్నారు. సిల్క్‌యారా టన్నెల్ దగ్గర తాత్కాలిక క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా.. అటు రాష్ట్ర దైనందిన పాలనా కార్యక్రమాలకూ ఆటంకం లేకుండా చూసుకుంటున్నారు. ప్రతీఏటా ఇదేరోజు ఏగాస్ పండుగను రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటారు కాని.. ఈసారి వద్దని సీఎం ధామి ప్రజలను అభ్యర్ధించారు. దానికి బదులుగా పండుగను మౌనంగా.. కార్మికులు బయటకు రావాలన్న ప్రార్ధనలతో జరుపుకోవాలన్నారు ధామి.
#WATCH | Uttarkashi(Uttarakhand) Tunnel rescue | On the drone technology that is being used in the rescue operation, Cyriac Joseph, MD & CEO, Squadrone Infra Mining Pvt Ltd says, "This (drone) is one of the latest technologies which can go inside the tunnel, it goes into GPS… pic.twitter.com/XGve8bkShU
— ANI (@ANI) November 24, 2023
కార్మికులను రక్షించేందుకు ఈ రెండు వారాల్లో 47 మీటర్ల దూరం తవ్వారు అధికారులు. ఇంకా పదిమీటర్ల మేర తవ్వాల్సిఉంది. ఈనేపథ్యంలో పనులకు మరోసారి ఆటంకం కలుగడం.. ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చిన్న సొరంగం ద్వారా కార్మికులకు మంచినీరు.. ఆహారాన్ని పంపుతున్నారు. ఈరోజు ఆ 22 టన్నుల భారీ డ్రిల్లింగ్ యంత్రం బాగైతే.. తిరిగి పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..