ఉత్తరాఖండ్ విషాదం, ఇస్రో తీసిన ఇమేజీల్లో కళ్ళకు కట్టిన ప్రకృతి విలయం, అదే బీభత్సం

| Edited By: Anil kumar poka

Feb 10, 2021 | 4:52 PM

ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో ఈ నెల 7 న సంభవించిన జల ప్రళయం తాలూకు దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) కి చెందిన శాటిలైట్ ఇమేజీలుగా తీసింది.

ఉత్తరాఖండ్ విషాదం, ఇస్రో తీసిన ఇమేజీల్లో కళ్ళకు కట్టిన ప్రకృతి విలయం, అదే బీభత్సం
Follow us on

ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో ఈ నెల 7 న సంభవించిన జల ప్రళయం తాలూకు దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) కి చెందిన శాటిలైట్ ఇమేజీలుగా తీసింది. అడ్వాన్స్డ్ ఎర్త్ ఇమేజ్ అండ్ మ్యాపింగ్ శాటిలైట్ ‘కార్డోశాట్-3’ స్పష్టంగా వీటిని తీసినట్టు ఈ సంస్థ వర్గాలు తెలిపాయి. హై రిసొల్యూషన్ ఇమేజింగ్ కేపబిలిటీలతో కూడిన ఈ మూడో తరం శాటిలైట్…జరిగిన ఉత్పాతాన్ని చూపింది. ఛమోలీ జిల్లాతో బాటు చుట్టుపక్కన గల  ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను, తపోవనం లో ధౌలి గంగ వద్ద డ్యామ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజీని ఈ ఇమేజీలు చూపుతున్నాయి. ఇస్రో శాస్త్రజ్ఞులతో బాటు డీ ఆర్ డీఓ బృందం కూడా ఈ విషాదానికి కారణాలను అన్వేషిస్తున్నాయి. డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ పరికరాలతో బుధవారం ఆయా బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమై కనిపించాయి. టన్నుల కొద్దీ ఇసుక, మట్టి పెళ్లలు, బండరాళ్లను తొలగించుకుంటూ.. తపోవన్ సొరంగ మార్గంలో చిక్కుకుపోయినవారిని రక్షించేందుకు శ్రమిస్తున్నాయి.

గ్లేసియర్ ఔట్ బరస్ట్ కావడానికి కారణాలను ఓ వైపు విశ్లేషిస్తూనే మరోవైపు ఇందులో మానవ తప్పిదం కూడా ఉందా అన్న విషయాన్ని కూడా నిపుణులు పరిశీలిస్తున్నారు. జోషీ మఠ్ తీరంలోని నందాదేవి గ్లేసియర్ ఇలా ‘పేలిపోవడానికి’ , మెరుపు వరదల కారణంగా కొండ చరియలు విరిగి పడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు. చమోలీ జిల్లాలోని రైనీ గ్రామం జరిగిన ఉత్పాతానికి సాక్షిగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో లెక్కకు మించి జల విద్యుత్ కేంద్రాలను నిర్మించడం కూడా పర్యావరణానికి చేటు తెఛ్చి ఉంటుందని భావిస్తున్నారు.

Read More:ప్రకృతిలో జీవులకు ప్రత్యేకబంధం ఉందా, ఉత్తరాఖండ్ విలయాన్ని చేపలు ముందే గుర్తించాయా! అలకనందనది నీరు బురదగా ఎందుకు మారింది..?

Read More:‘క్రోనీ జీవీ హై వో’, ‘దేశాన్నే వాళ్లు అమ్మేస్తున్నారు’, ప్రధాని మోదీ వ్యాఖ్యపై రాహుల్ గాంధీ ఫైర్