Glacier Burst: ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ మంచుచరియలు.. 47 మంది కార్మికులు సమాధి..

|

Feb 28, 2025 | 3:13 PM

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో భారీ హిమపాతం కురుస్తోంది. సాధారణ జీవితాన్ని పునరుద్ధరించడానికి, రోడ్లపై నుండి మంచును తొలగిస్తున్నారు. ఈ మంచును తొలగిస్తుండగా, శుక్రవారం ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. మంచుచరియలు విరిగిపడి 57 మంది కార్మికులు మంచు కింద చిక్కుకున్నారు. కార్మికులను రక్షించేందుకు చేయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Glacier Burst: ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ మంచుచరియలు.. 47 మంది కార్మికులు సమాధి..
Glacier Burst In Chamoli
Follow us on

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. బద్రీనాథ్ ధామ్‌లో మంచుచరియలు విరిగిపడటంతో 57 మంది కార్మికులు మంచు కింద చిక్కుకున్నారు. కార్మికులను రక్షించేందుకు సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. అయితే ఇప్పటివరకు 10 మంది కార్మికులను సురక్షితంగా తరలించారు. మరికొందరి కోసం వెతుకుతున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ కార్మికులందరూ బద్రీనాథ్ ధామ్‌లో రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. చమోలి జిల్లా పోలీసులు, స్థానిక అధికారులు, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) బృంద సభ్యులు సంఘటనా స్థలంలో ఉన్నారు.

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర తేదీలు ప్రకటించారు. ఈ దృష్ట్యా, బద్రీనాథ్ ధామ్‌కు మూడు కిలోమీటర్ల ముందున్న మానా గ్రామం సమీపంలో రోడ్డుపై ఉన్న మంచును తొలగించి మరమ్మతులు చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. శుక్రవారం(ఫిబ్రవరి 28) ఉదయం ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు చెందిన 57 మంది కార్మికులు రోడ్డుపై మంచును తొలగిస్తున్నారు. అకస్మాత్తుగా పర్వతంపై ఉన్న మంచుచరియలు విరిగిపడి కార్మికులందరూ మంచు కింద కూరుకుపోయారు.

ప్రమాదం గురించి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కమాండర్ అంకుర్ మహాజన్ సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే, BRO అధికారులు, జిల్లా పోలీసు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మంచు కింద కూరుకుపోయిన 10 మంది కార్మికులను సురక్షితంగా రక్షించగా, మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మానా గ్రామానికి ఒక కిలోమీటరు ముందు ఆర్మీ క్యాంప్ సమీపంలోని రోడ్డుపై ఈ ప్రమాదం జరిగిందని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కమాండర్ అంకుర్ మహాజన్ తెలిపారు.

BRO కమాండర్ అంకుర్ మహాజన్ ఈ ఘటనపై స్పందించారు. ఉదయం 8:00 గంటలకు కొండ నుండి హిమపాతం అంటే మంచుచరియలు పేలడం గురించి సమాచారం అందిందని అన్నారు. సమాచారం అందిన వెంటనే సహాయ చర్యలు ప్రారంభించామని అంకుర్ మహాజన్ తెలిపారు. ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ కు చెందిన 57 మంది కార్మికులు మంచు కింద సమాధి అయ్యారు. ఈ కార్మికులందరూ అక్కడి ఒక శిబిరంలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సమయంలో బద్రీనాథ్ ధామ్‌లో భారీగా హిమపాతం కురుస్తోంది. సాధారణ జీవితాన్ని నరుద్ధరించడానికి, రోడ్లపై నుండి మంచును తొలగిస్తున్నారు. హిమపాతం కారణంగా సహాయక చర్యల్లో ఇబ్బంది ఏర్పడిందని BRO కమాండర్ అంకుర్ మహాజన్ తెలిపారు. అయినప్పటికీ మా బృందం కార్మికులను మంచు నుండి సురక్షితంగా రక్షించడానికి ప్రయత్నిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..