Uttarakhand flash flood : ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగిపడి ధౌలి గంగ పోటెత్తి ఒక పవర్‌ప్రాజెక్ట్‌ని ముంచెత్తింది. అందులో పని చేస్తున్న కార్మికులు గల్లంతయ్యారు. చమోలి జిల్లాలో చోటుచేసుకున్న పెను విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటనపై ఆరాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది.
చమోలో జిల్లాలో పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారంనాడు ఏరియల్ సర్వే చేశారు. జోషిమఠ్‌లోని ఐటీబీపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం రావత్ పరామర్శించారు. సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడిన 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, త్వరలోనే వారు కోలుసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. వారికి మెరుగైన వైద్య అందించాలని అధికారులకు సూచించారు సీఎం రావత్.
Rescue team has managed to reach Malari Valley area through rope & now necessary packages, ration can be sent easily. Earlier, only a limited stock could be supplied via helicopter but there won’t be any problem now: Uttarakhand CM Trivendra Singh Rawat@tsrawatbjp #Uttarakhand pic.twitter.com/b5zr7EizgA
— Gulistan News (@GulistanNewsTV) February 9, 2021
ఇదిలావుంటే, జలవిలయంలో మృతుల సంఖ్య తాజాగా 26కు చేరుకోగా, 171 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదని రాష్ట్ర ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు భారత సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. మరో సొరంగంలో చిక్కుకున్న 35 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ రాత్రి నుంచి కొనసాగుతోంది. శిథిలాల తొలగింపు జరుగుతోందని డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. సాయంత్రానికి కల్లా మార్గం క్లియర్ అవుతుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.