Uttar Pradesh: టీవీ ఛానల్‌ మార్చే విషయమై అన్నదమ్ముల మధ్య గొడవ.. తమ్ముడిని కత్తితో పొడిచి హత్య చేసిన అన్న

|

Oct 15, 2024 | 3:29 PM

. ఇంట్లో ఇద్దరు కుమారులు బిట్టు, అభిషేక్ ఉన్నారు. వీరిద్దరూ టీవీ చూస్తున్నారు. ఇంతలో చానల్ మార్చే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రిమోట్ విషయంలో గొడవలు మొదలైంది. హటాత్తుగా అన్నయ్య బిట్టు కత్తి తీసుకొచ్చి అభిషేక్‌పై దాడి చేశాడు. కడుపులో పలుమార్లు కత్తితో పొడిచాడు. తమ్ముడిని హత్య చేసిన తర్వాత బిట్టు చేతిలోని కత్తితో ఇంటి పైకప్పుకు చేరుకున్నాడు.

Uttar Pradesh: టీవీ ఛానల్‌ మార్చే విషయమై అన్నదమ్ముల మధ్య గొడవ.. తమ్ముడిని కత్తితో పొడిచి హత్య చేసిన అన్న
Up Crime News
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. టీవీ ఛానల్ మార్చే విషయంలో అన్నదమ్ములిద్దరి మధ్య వివాదం నెలకొంది. సోదరులు ఇద్దరూ ఒకరితో ఒకరు గొడవపడ్డారు. ఛానెల్‌ మార్చుకునే విషయంలో వచ్చిన గొడవల్లో అన్నయ్యకు ఆగ్రహం వచ్చి.. కత్తి తీసుకుని తమ్ముడిని పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. ఈ ఘటనపై ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. నిందితుడైన సోదరుడిని అరెస్టు చేశారు. కుమారుడి మరణవార్తతో తల్లి ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

ఈ ఘటన నగర్‌ కొత్వాలి నాయగావ్‌ ధామిడా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇరుగుపొరుగు చెప్పిన ప్రకారం హత్య చేసిన యువకుడు డ్రగ్స్ బానిస. తండ్రి ఎప్పుడో చనిపోయాడు. అయినా సరే ఇంటికి పెద్ద కొడుకైనా సరే ఏ విధమైన పని చేయకుండా బలాదూర్ గా తిరుగుతాడు. తల్లి కుటుంబాన్ని పోషించడానికి బులంద్‌షహర్‌లో పనిచేస్తోంది. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. నిందితుడు తన తమ్ముడి కడుపులో పలుమార్లు కత్తితో పొడిచాడు. హత్య చేసిన తర్వాత ఇంటి పైకప్పుపైకి కత్తిని పట్టుకుని చేరుకున్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఛానెల్ మార్చడంపై గొడవ

నయాగావ్ దమీద నివాసి అనిత భర్త మరణించడంతో తన కుటుంబం పోషణ కోసం చాలా కష్టపడుతోంది. అనితకు ముగ్గురు కొడుకులు. సోమవారం ఉదయం ఎప్పటిలాగే పనికి వెళ్లింది. ఇంట్లో ఇద్దరు కుమారులు బిట్టు, అభిషేక్ ఉన్నారు. వీరిద్దరూ టీవీ చూస్తున్నారు. ఇంతలో చానల్ మార్చే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రిమోట్ విషయంలో గొడవలు మొదలైంది. హటాత్తుగా అన్నయ్య బిట్టు కత్తి తీసుకొచ్చి అభిషేక్‌పై దాడి చేశాడు. కడుపులో పలుమార్లు కత్తితో పొడిచాడు. తమ్ముడిని హత్య చేసిన తర్వాత బిట్టు చేతిలోని కత్తితో ఇంటి పైకప్పుకు చేరుకున్నాడు.

ఇవి కూడా చదవండి

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

టెర్రస్‌పై ఉన్న బిట్టు చేతిలో కత్తితో ఉండడం చూసి ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి అక్కడ అభిషేక్ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు బిట్టును అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై మృతుడి తల్లికి సమాచారం అందించారు. వార్త తెలియగానే ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..