Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలో ఓ వైన్‌షాప్ యజమాని, కొందరు రౌడీలు కలిసి ఓ యువకుడిని చితక్కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. వైన్ షాపులో ఈ ఘటన జరుగగా.. మరుసటి రోజున బాధిత యువకుడి మృతదేహం రైల్వే ట్రాక్‌పై లభ్యమైంది. ఈ ఘటన ఇప్పుడు యూపీలో సంచలనం రేకెత్తిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. బండా జిల్లాలోని అటార్రా పట్టణానికి చెందిన సుగం గుప్తా అనే యువకుడు.. రామ నవమి ఊరేగింపు దృశ్యాన్ని చూస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. అయితే, ఓ వైన్ షాపులో గుప్తా దొంగతనం చేశాడని ఆరోపిస్తూ వైన్ షాపు నిర్వాహకులు యువకుడిని దారుణంగా కొట్టారు. సుగం గుప్తా తండ్రికి ఫోన్ చేసి.. ‘మీ వాడు షాపులో దోపిడీ చేశాడు. డబ్బులు ఇచ్చే వరకు కొడుతూనే ఉంటాం.’ అని చెప్పి ఫోన్ కట్ చేశారు. దాదాపు 5 గంటల పాటు ఆ యువకుడిని ఇనుప రాడ్డుతో దారుణంగా కొట్టారు.
ఈ ఘటనను ఫోన్‌లో వీడియో చిత్రీకరించారు కూడా. అయితే, మరుసటి రోజు ఉదయం యువకుడు సుగం గుప్తా మృతదేహం రైల్వే ట్రాక్‌పై లభ్యమైంది. దాంతో యువకుడి తండ్రి జగదీష్ గుప్తా పోలీసులను ఆశ్రయించాడు. తన కొడుకుని చంపేశారంటూ ఫిర్యాదు చేశారు. వైన్ షాపు యజమాని రాజా ద్వివేది, రాజేష్ ద్వివేది తదితరులు తన కొడుకుని కొట్టి చంపేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నాయి. అయితే, నిందితులను ఇంకా అరెస్ట్ చేయకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు రాజకీయ పలుకుబడి ఉందని, ఆ కారణంగానే పోలీసులు వారిని ఇంకా అరెస్ట్ చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ కొడుకుని చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు.
Also read:
Migraine Relief Tips: ఈ ఐదు యోగాసనాలు మైగ్రేన్ మరియు తలనొప్పి నుండి బయటపడటానికి సహాయపడతాయి
Hair Care Tips: జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారా? ఉల్లిపాయ నూనెతో ఇలా చేయండి..
Viral Video: 71 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లే అంటున్న బామ్మ.. ఏకంగా 11 రకాల వెహికిల్ లైసెన్స్‌లు పొందిం..