Farmer’s Daughter: సరస్వతి పుత్రికకు అందిన అవకాశం.. యూఎస్ యూనివర్సిటీలో 100% స్కాలర్‌షిప్

|

Jan 06, 2023 | 2:23 PM

చదువు విలువ తెలుసుకుని.. తనని తాను నిరంతరం మలచుకుంటూ ఒక గొప్ప ఐడియాతో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం చదువుకునే అవకాశాన్ని పొందింది. అవును  ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన ఒక అమ్మాయి స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి స్కాలర్‌షిప్ పొందింది.

Farmers Daughter: సరస్వతి పుత్రికకు అందిన అవకాశం.. యూఎస్ యూనివర్సిటీలో 100% స్కాలర్‌షిప్
Up Girl Dakshayani
Follow us on

కొందరు తమకు ఉన్న దానిలో అవకాశాలను సృష్టించుకుని కృషి, పట్టుదలతో తాము అనుకున్నది సాధించి చరిత్రలో తమకంటూ ఓ పేజీని లిఖించుకుంటారు.  అందుకు ఉదాహరణగా నిలుస్తోంది… ఓ యువతి.. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి.. చదువు విలువ తెలుసుకుని.. తనని తాను నిరంతరం మలచుకుంటూ ఒక గొప్ప ఐడియాతో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం చదువుకునే అవకాశాన్ని పొందింది. అవును  ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన ఒక అమ్మాయి స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి స్కాలర్‌షిప్ పొందింది. దాక్షాయణి పాండే సెప్టెంబర్ 2023లో స్టాన్‌ఫోర్డ్‌లో చేరనుంది. ఈరోజు ఉత్తరప్రదేశ్‌ నుండి USA లోని  కాలిఫోర్నియా వరకూ దాక్షాయణి ప్రయాణం గురించి తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్‌లోని మౌలోని ఒక చిన్న గ్రామానికి చెందిన దాక్షాయణి తల్లిదండ్రులు చదువు విలువను అర్థం చేసుకున్నారు. దీంతో తమ  కుమార్తెను చదువుకోమని ప్రోత్సహించారు. 10వ తరగతిలో.. విద్యాజ్ఞాన్‌లో టాపర్ గా నిలిచింది. దాక్షాయణి చదువులో ఎప్పుడూ  టాప్ 10 విద్యార్థుల జాబితాలో ఉంటుంది. అంతేకాదు ఇటీవల నేషనల్ యూత్ ఐడియాథాన్ 2021 విజేతగా కూడా నిలిచింది.

ఐడియాథాన్ కోసం.. దాక్షాయణి తన ఆలోచనకు పదుని పెట్టి.. ఆటోమోటివ్ ప్రోటోటైప్‌ను తయారు చేసింది. ఇది కారులో చిక్కుకున్న మరణాల బారిన పడుతున్న శిశువుల ప్రాణాలను రక్షించగలదు. ఒకొక్కసారి మూసి ఉన్న కారులో చిన్నారులుంటే.. వారు ఆక్సిజన్ అందక ఊపిరాడకుండా ఇబ్బంది పడతారు. ఒకొక్కసారి ప్రాణాలను కూడా పోగొట్టుకుంటారు.

ఇవి కూడా చదవండి

స్వచ్ఛంద సేవ విషయంలో ఎప్పుడూ చురుగ్గా ఉండే దాక్షాయణి.. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలి భావించింది. సరికొత్త యంత్రాన్ని రూపొందింది. అంతేకాదు తాను స్టాండ్‌ఫోర్డ్ యూనివర్శిటీలో చదువుకునే సమయంలో.. వినూత్నమైన వ్యవస్థాపకతలో పని చేయాలని.. భారతదేశంలోని యువత వ్యఐడియాలజీని పదిమందికి తెలియజేయాలని.. యువతను నడిపించడంలో సహాయపడాలని కోరుకుంటుంది.

అంతేకాదు దీర్ఘకాలంలో, దాక్షాయణి భారతదేశంలోని పిల్లల విద్యకు తోడ్పడాలని కోరుకుంటుంది. తద్వారా తాను ఇతర విద్యార్థులకు వచదువుని బహుమతిని అందిస్తానని తెలిపింది. అప్పుడు చదువు వారి జీవితాలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని తెలిపింది దాక్షాయణి. సెప్టెంబర్ 2023 న USAలోని ప్రతిష్టాత్మక కళాశాల స్టాన్‌ఫోర్డ్‌లో బయో ఇంజనీరింగ్‌లో మేజర్ మరియు ఎంట్రప్రెన్యూర్‌షిప్‌లో మైనర్‌ను అభ్యసించనుంది దాక్షాయణి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..