Viral Video: బైక్‌పై ఒకరు లేక ఇద్దరు.. కానీ ఏడుగురేంటి భయ్య..! అందరూ పిల్లగాల్లే.. ఎక్కడంటే

| Edited By: Srilakshmi C

Aug 09, 2023 | 2:03 PM

ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ జిల్లాలో జరిగిందీ సంఘటన. ఓకే బైక్ పై ముగ్గురు కాదు నలుగురు కాదు ఏకంగా ఏడుగురు ప్రయాణం చేస్తూ రయ్ మంటు రోడ్ల పై చక్కర్లు కొట్టారు. బైక్ నడిపే వ్యక్తి ముందు ఒకరు, అతని వెనక నలుగురు కూర్చున్నారు. ఏడో వ్యక్తి మాత్రం చూసే వారికే భయం కలిగేలా చివరి వ్యక్తి భుజాల పైన కూర్చున్నాడు. బైక్ నీ రైడ్ చేసే వ్యక్తి కానీ బైక్ పై ఉన్న మిగతా ఆరుగురు వ్యక్తులు కానీ ఏ ఒక్కరూ మేజర్‌లలా లేరు. అందరూ 20 ఏళ్ల లోపు వారిలా కనిపిస్తున్నారు. అంటే కనీసం ఏ ఒక్కరికీ..

Viral Video: బైక్‌పై ఒకరు లేక ఇద్దరు.. కానీ ఏడుగురేంటి భయ్య..! అందరూ పిల్లగాల్లే.. ఎక్కడంటే
Boys Riding On A Single Bike
Follow us on

లక్నో, ఆగస్టు 9: సాధారణంగా ఒక బైక్ పై ఒకరు లేక ఇద్దరు మహా అయితే ముగ్గురం జర్నీ చేస్తాం. ఇద్దరు వరకు ఓకే కానీ ముగ్గురు అయితే అది చట్టవిరుద్ధమని మనందరికీ తెలుసు. కానీ అప్పుడప్పుడు చాలా మంది ఒక బైక్ పై ముగ్గురు వెళ్తుంటారు. అది మనకు చాలా కామన్ గా కనిపిస్తుంది. కానీ అక్కడ మాత్రం ఒక్క బైక్ పై ఏడుగురు ప్రయాణం చేస్తూ అందరిని ఆశ్చర్యానికి, భయానికి గురి చేశారు. అది ఎక్కడ అనుకుంటున్నారా..? ఐతే మీరీ స్టోరీ చదవాల్సిందే.

ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ జిల్లాలో జరిగిందీ సంఘటన. ఓకే బైక్ పై ముగ్గురు కాదు నలుగురు కాదు ఏకంగా ఏడుగురు ప్రయాణం చేస్తూ రయ్ మంటు రోడ్ల పై చక్కర్లు కొట్టారు. బైక్ నడిపే వ్యక్తి ముందు ఒకరు, అతని వెనక నలుగురు కూర్చున్నారు. ఏడో వ్యక్తి మాత్రం చూసే వారికే భయం కలిగేలా చివరి వ్యక్తి భుజాల పైన కూర్చున్నాడు. బైక్ నీ రైడ్ చేసే వ్యక్తి కానీ బైక్ పై ఉన్న మిగతా ఆరుగురు వ్యక్తులు కానీ ఏ ఒక్కరూ మేజర్‌లలా లేరు. అందరూ 20 ఏళ్ల లోపు వారిలా కనిపిస్తున్నారు. అంటే కనీసం ఏ ఒక్కరికీ కనీసం బైక్ నడిపే లైసెన్స్ కూడా ఉండి ఉండదు. ఇలాంటి డేంజర్ ఫిట్ చేయడం సరైంది కాదు అని చూసిన వారు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఒకే బైక్‌పై ఏడుగురు మైనర్లు ప్రయాణిస్తున్న వీడియో..

 

టు వీలర్ పై ఇలాంటి ప్రయాణాలు యమ డేంజర్‌. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదు. బైక్‌లపై ఇద్దరు కంటే ఎక్కువమంది ప్రయాణించడం చట్టవిరుద్దం అని ఈ విడియో నీ ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఇలాంటి పని చేయకూడదని  ఐపీఎస్ సజ్జానార్ ట్వీట్ చేశారు.

సజ్జనార్ ట్వీట్ చేసిన వీడియో ఇదే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.