UP CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డబులు ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తన మంత్రులకు, వారి కుటుంబాలకు చెందిన అన్ని ఆస్తులను మూడు నెలల్లోగా ప్రకటించాలని ఆదేశించారు. మంత్రులతో పాటు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (పీసీఎస్) అధికారులను కూడా ఆస్తులను బహిర్గతం చేయాలని సీఎం యోగి సూచించారు. దీంతో పాటు ప్రభుత్వ పనుల్లో మంత్రుల కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోకూడదన్నారు.
మంగళవారం లోక్‌భవన్‌లో తన మంత్రివర్గ సభ్యులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి, ప్రజా ప్రతినిధుల ప్రవర్తనలో పవిత్రత చాలా ముఖ్యమన్నారు. ఈ స్ఫూర్తి ప్రకారం, మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చే మూడు నెలల వ్యవధిలో తమకు, వారి కుటుంబ సభ్యులకు చెందిన అన్ని చర, స్థిరాస్తులను బహిరంగంగా ప్రకటించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రిగా యోగి, ఆయన మంత్రివర్గ సభ్యులు మార్చి 25న ప్రమాణ స్వీకారం చేయించిన సంగతి తెలిసిందే.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను అక్షరబద్ధంగా, స్ఫూర్తితో పాటిస్తూ మంత్రులకు సూచించిన ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దీనితో పాటు, ‘ప్రభుత్వ సేవకులందరూ తమ, కుటుంబ సభ్యుల అన్ని చర / స్థిరాస్తిని బహిరంగంగా ప్రకటించాలి.ఈ వివరాలను సాధారణ ప్రజల కోసం ఆన్‌లైన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచాలి’ అని ఆయన అన్నారు.
ప్రభుత్వ పనుల్లో మంత్రుల కుటుంబ సభ్యుల జోక్యంపై వచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి.. ‘ప్రభుత్వ పనుల్లో తమ కుటుంబ సభ్యుల జోక్యం లేకుండా మంత్రులందరూ చూసుకోవాలి’ అని స్పష్టం చేశారు. సీఎం యోగి సలహా ఇస్తూ, ‘మన ప్రవర్తన ద్వారా మనం ఆదర్శాలను అందించాలి. దీనితో పాటు, ‘అప్పుడు ప్రభుత్వం ప్రజల తలుపుకు చేరుకుంటుందని, రాబోయే శాసనసభ సమావేశాల కంటే ముందే మంత్రులు రాష్ట్రంలో పర్యటించే పనిని పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించి 18 మంత్రుల బృందాలను ఏర్పాటు చేసి వారికి మండలాలను కేటాయించారు.
అధికారిక ప్రకటన ప్రకారం, ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల బృందంలో ఒక్కో రాష్ట్ర మంత్రి ఉంటారు. మిగిలిన ముగ్గురు సభ్యుల మంత్రుల బృందం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పర్యటన కార్యక్రమం శుక్రవారం నుండి ఆదివారం వరకు ఉంటుంది. తొలిదశలో రాష్ట్రంలో పర్యటించిన తర్వాత రొటేషన్ విధానంలో ఇతర విభాగాల బాధ్యతలను మంత్రి వర్గాలకు అప్పగించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే సర్కిల్ పర్యటనలో ప్రతి బృందం కనీసం 24 గంటలపాటు జిల్లాలోనే ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బృందానికి నాయకత్వం వహించే సీనియర్ మంత్రులు కనీసం రెండు జిల్లాల్లో పర్యటించాలి.
ముఖ్యమంత్రి పర్యటనలో మంత్రులకు మార్గదర్శకాలను కూడా రూపొందించారు. డివిజన్ సమీక్షా సమావేశాలలో శాఖల వారీగా ప్రజెంటేషన్లను చూసే బాధ్యతను వారికి ఇచ్చారు. పర్యటనలో తప్పనిసరిగా జన్ చౌపాల్ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ప్రజలతో నేరుగా సంభాషించాలన్నారు. ఇది కాకుండా, ఏదైనా ఒక డెవలప్‌మెంట్ బ్లాక్, తహసీల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేయండి. దళిత, మురికివాడలో సహ భోజన కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం యోగి ఆదేశించారు.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సమావేశమై శాంతిభద్రతలు, మహిళా భద్రత, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ప్రాసిక్యూషన్ స్థితిగతులు, పోలీసు గస్తీ, బాలలపై అత్యాచారాలు, వ్యాపారులు తదితర అంశాలపై సమీక్షించాలని సూచించారు. సమస్యలు, గ్యాంగ్‌స్టర్‌పై చర్యలు తదితరాలను కూడా చూడాలని కోరారు. మంత్రుల గ్రూపుల్లోని ప్రతి ఒక్కరు ఒక జిల్లాలోనే రాత్రి విశ్రాంతి తీసుకోవాలని సీఎం యోగి చెప్పారు.
ఒక అధికారిక ప్రకటనలో, “ప్రతి బృందం తన పర్యటన నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయానికి సమర్పిస్తుంది. మంత్రుల బృందం యొక్క అంచనా నివేదికను మంత్రి మండలి సమావేశంలో చర్చించనున్నారు. దీని తరువాత, ప్రజా ప్రయోజనాల కోసం మరిన్ని చర్యలు తీసుకుంటారు. సోమ, మంగళవారాల్లో మంత్రులంతా రాజధానిలోనే ఉండాలని ముఖ్యమంత్రి కోరారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ కాకుండా, సూర్య ప్రతాప్ షాహి మీరట్, సురేష్ ఖన్నా లక్నో, స్వతంత్ర దేవ్ సింగ్ మొరాదాబాద్, బేబీ రాణి మౌర్య ఝాన్సీ, చౌదరి లక్ష్మీ నారాయణ్ అలీఘర్, జైవీర్ సింగ్ చిత్రకూట్ ధామ్, ధరంపాల్ సింగ్ గోరఖ్‌పూర్, నంద్ గోపాల్ గుప్తా నంది బరేలీ, భూపేంద్ర సింగ్ మీర్జాపూర్, అనిల్ రాజ్‌భర్ ప్రయాగ్‌రాజ్, జితిన్ ప్రసాద్ కాన్పూర్, రాకేష్ సచన్ దేవిపటన్, అరవింద్ శర్మ అయోధ్య, యోగేంద్ర ఉపాధ్యాయ్ సహరాన్‌పూర్, ఆశిష్ పటేల్ బస్తీ మరియు సంజయ్ నిషాద్ధి అజంగఢ్ డివిజన్.. బాధ్యతలు అప్పగించారు.
Read Also… Andhra Pradesh: వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. త్వరలో కేబినెట్ హోదా