మహాశివరాత్రి సందర్భంగా కన్వర్ యాత్రలో పాల్గొన్న శివ భక్తులకు ఓ యువకుడు బీరు పంపిణీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. వీడియోలో కనిపించినట్టుగా.. రద్దీగా ఉండే రహదారిపై నిలబడి యాత్రికులకు బీర్ అందిస్తున్నాడు ఒక వ్యక్తి. స్థానికుల సమాచారం మేరకు సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వ్యక్తిని యోగేష్‌గా గుర్తించారు. నిందితుల నుంచి ఒక బైక్, 14 బీరుబాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా ప్రజలకు పెద్ద మొత్తంలో బీరు విక్రయిస్తున్న మద్యం దుకాణాల యజమానులపై కూడా ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంటోందని అలీగఢ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
దీనిపై పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కన్వర్ యాత్రలో పాల్గొన్న భక్తులకు బీరు అందిస్తున్న వ్యక్తిని ఎందుకు అరెస్టు చేశారంటూ కొందరు ప్రశ్నించారు. ప్రార్థనకు వెళ్లే వారికి ఈ పానీయాలు ఎలా అందుతున్నాయని మరికొందరు ఆశ్చర్యపోతూ కామెంట్ చేశారు. యాత్రలో పాల్గొనేవారికి మద్యం ఇచ్చేవారిని మాత్రమే ఎందుకు అరెస్టు చేస్తారు..? బీరు స్వీకరించే వారిపై కూడా కేసు పెట్టాలి. ప్రార్థనలకు వెళుతూ మద్యం సేవించే వారిని ఎలా విడిచిపెడతారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
In UP’s Aligarh, several videos of a man offering beer to Kanwariyas on the road has surfaced. An FIR under relevant sections of excise act has been registered. pic.twitter.com/KF2xQjeWfH
— Piyush Rai (@Benarasiyaa) February 17, 2023
కన్వర్ యాత్ర అనేది శివుని భక్తులు సంవత్సరానికి ఒకసారి చేసే వార్షిక తీర్థయాత్ర. ఇందులోని భక్తులను ‘కణ్వరియాలు’ అంటారు. ఇందులో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి, బీహార్‌లోని సుల్తాన్‌గంజ్ వంటి ప్రదేశాలను భక్తులు సందర్శిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..