Overnight Crorepati: అబ్బ ఏం అదృష్టం.. రాత్రికి రాత్రే రూ.1000 కోట్లకు అధిపతైన రైతు.. ఎలాగంటే!

|

May 19, 2024 | 12:05 PM

అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కటిక పేదవాడు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవడం.. కోటీశ్వరులు దివాలా తీయడం వంటి సంఘటనలు అడపాదడపా వార్తల్లో వింటూనే ఉంటాం. తాజాగా అలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. కూలి పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే సన్నకారు రైతును అదృష్టం వరించి ఓవర్‌నైట్‌ కోటీశ్వరుడై పోయాడు. అతని బ్యాంకు ఖాతాలో..

Overnight Crorepati: అబ్బ ఏం అదృష్టం.. రాత్రికి రాత్రే రూ.1000 కోట్లకు అధిపతైన రైతు.. ఎలాగంటే!
Uttar Pradesh Man Turns Overnight Crorepati
Follow us on

లక్నో, మే 19: అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కటిక పేదవాడు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవడం.. కోటీశ్వరులు దివాలా తీయడం వంటి సంఘటనలు అడపాదడపా వార్తల్లో వింటూనే ఉంటాం. తాజాగా అలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. కూలి పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే సన్నకారు రైతును అదృష్టం వరించి ఓవర్‌నైట్‌ కోటీశ్వరుడై పోయాడు. అతని బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.10 వేల కోట్ల జమయ్యాయి. ఈ విషయం తెలియక సాధారణంగా తన బ్యాంకు ఖాతా బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకున్న సదరు రైతు.. అన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయని తెలుసుకుని దాదాపు పిచ్చివాడై పోయాడు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని వదోహి జిల్లా నివాసి భాను ప్రసాద్, అతని కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. గత వారం అతను తన బ్యాంక్ ఖాతాను తనిఖీ చేసుకుని.. ఒక్కసారిగా గుడ్ల తేలేశాడు. తన కళ్లను తాను నమ్మలేక రెండు సార్లు చెక్‌ చేసుకున్నాడు. కానీ తాను చూసేది వాస్తవం అని గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు. తన బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ. 99, 99,94,95,999 దాదాపు (రూ. వెయ్యి కోట్లు) జమ అయినట్లు గుర్తించాడు. ఇంత పెద్ద మొత్తం తన బ్యాంకు ఖాతాకు ఎలా వచ్చిందో తెలియక ఆందోళన చెందిన భాను ప్రసాద్‌.. వెంటనే బ్యాంకుకు వెళ్లి అధికారులను సంప్రదించాడు.

బ్యాంకు అధికారులు కూడా ఓ సామాన్య రైతు ఖాతాకు రూ.9,990 కోట్లు ఎలా వచ్చాయో తెలియక కంగారు పడ్డారు. విచారణలో సాంకేతిక సమస్య కారణంగా రైతు ఖాతాలోకి ఇంత డబ్బు చేరినట్లు తేలింది. నిజానికి, భాను ప్రకాష్ ఖాతా కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ ఖాతా అని, సాంకేతిక సమస్య కారణంగా అతని ఖాతాలోకి భారీగా డబ్బు జమ అయినట్లు అధికారులు తెలిపారు. అనంతరం తప్పును సరిచేసి అతని ఖాతాలోని డబ్బు మొత్తం వెనక్కి తీసుకున్నారు. దీంతో రాత్రికి రాత్రే 10 వేల కోట్ల రూపాయలకు యజమానిగా మారిన భాను ప్రసాద్‌ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేకపోయాడు. సమస్యను పరిష్కరించేంత వరకూ బ్యాంకు ఖాతాను బ్యాంకు అధికారులు అతని ఖాతాను తాత్కాలికంగా స్తంభింపజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.