
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.. 18 నెలల పసికందును ఓ వ్యక్తి.. పదేపదే నేలకేసి కొట్టి కిరాతకంగా హత్య చేశాడు.. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. మనస్పర్థల కారణంగా తన బిడ్డతో కలిసి భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళ.. అతనితో పెళ్లికి నిరాకరించింది. అయితే.. తన పెళ్లికి ఈ చిన్నారి కారణమని.. ఆ వ్యక్తి ఆ మహిళ కుమారుడిని తీసుకెళ్లి నేలకేసి కొట్టి చంపేశాడు. ఈ భయానక దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా.. కలవరపరిచే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిందితుడిపై త్వరితగతిన, కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోలో, నిందితుడు ఆ చిన్నారిని పదేపదే అత్యంత బలంతో నేల మీదకు విసిరేయడం కనిపిస్తుంది. మే 30న “డెడ్లీ కలేష్” అనే హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. దీంతో నిందితుడిపై కఠిన శిక్ష విధించాలని తీవ్ర ఆగ్రహం, డిమాండ్లు వెల్లువెత్తాయి.
ఆ వ్యక్తి బాలుడి బంధువుల ఇంటి బయట ఉన్న నిర్మానుష్యమైన సందు గుండా ఆ పసికందును తీసుకువెళ్లి, తర్వాత ఆ పిల్లాడిని పదేపదే బలంగా నేలకేసి కొట్టడం కనిపిస్తుంది. ఈ దారుణమైన దాడి తర్వాత ఆ చిన్నారి కదలకుండా పడి ఉండటం కనిపించింది. గమనించిన కుటుంబసభ్యులు.. ఆ పసికందును సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు బాధిత చిన్నారిని రతి.. సుమిత్‌ల కుమారుడైన 18 నెలల ఆరవ్ (కల్లు)గా గుర్తించారు. బాలుడి తల్లి పెళ్లికి నిరాకరించడంతో.. ఆ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పేర్కొంటున్నారు.
Brutal 🤢
The toddler was allegedly slammed against the ground repeatedly, leading to his death.
Toddler Allegedly Lured With Candy, Killed in Firozabad
A heartbreaking incident has been reported from Yadav Colony in Shikohabad, Firozabad, where 18-month-old Aarav was… pic.twitter.com/AmJVhaRwdm
— Atulkrishan (@iAtulKrishan1) May 30, 2026
ఫిరోజాబాద్‌కు చెందిన రతిదేవి (40) సుమిత్ ఇద్దరూ దంపతులు.. రతిదేవి మహిళ టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది.. ఈ క్రమంలో మనస్పర్థలతో భర్త నుంచి విడిపోయి, తన ఏడాదిన్నర కుమారుడు ఆరవ్‌తో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. అయితే, విడాకుల విషయంలో ఆమెకు సాయం చేస్తానని జితేంద్ర అలియాస్ విరాజ్ ఆమెకు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో ఆ వివాహితపై మనసుపడ్డ విరాజ్.. తన మనసులో మాట ఆమెకు చెప్పి, వివాహ ప్రతిపాదన చేశాడు. అయితే, ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా పెళ్లికి అంగీకరించడంతో రతిదేవిపై విరాజ్ పగ పెంచుకున్నాడు. ఆ పసిపాపను తమ సంబంధానికి అడ్డంకిగా ఉన్నాడని విరాజ్ భావించి ప్లాన్ రచించాడు..
ఈ క్రమంలో రతి శుక్రవారం తన పుట్టింటి నుండి అత్తగారి ఇంటికి వచ్చింది. ఆమె ఎక్కడ ఉందో తెలుసుకున్న విరాజ్ అక్కడికి వచ్చాడు. అనంతరం చాక్లెట్ కొనిస్తానని చెప్పి చిన్నారి ఆరవ్‌ను ప్రలోభపెట్టి తీసుకెళ్లాడు.. ఈ క్రమంలో వీధిలో ఆ బాలుడిపై దారుణంగా దాడి చేశాడు.. పదేపదే నేలకేసి కొట్టి చంపాడు.. ఈ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే, కుటుంబ సభ్యులు ఆ బాలుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు.. అక్కడ వైద్య సిబ్బంది అతను మరణించినట్లు ప్రకటించారు.
సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు ఆ ప్రాంతం నుంచి పారిపోవడంతో, అతడిని పట్టుకునేందుకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టి, చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.