Uttar Pradesh: 10, 12వ తరగతి పరీక్షల్లో సత్తా చాటిన యూపీ ఖైదీలు

|

May 08, 2023 | 9:35 AM

ఉత్తరప్రదేశ్‌లోని పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు పది, పన్నెండవ తరగతి పరీక్షల్లో తమ ప్రతిభను కనబర్చారు. ఏప్రిల్ 25వ తేదిన యూపీలో 10, 12 తరగతుల పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. అయితే పదవ తరగతి పరీక్షలకు 60 మంది ఖైదీలు హాజరుకాగా అందులో 57 మంది పాసయ్యారు.

Uttar Pradesh: 10, 12వ తరగతి పరీక్షల్లో సత్తా చాటిన యూపీ ఖైదీలు
Jail
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు పది, పన్నెండవ తరగతి పరీక్షల్లో తమ ప్రతిభను కనబర్చారు. ఏప్రిల్ 25వ తేదిన యూపీలో 10, 12 తరగతుల పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. అయితే పదవ తరగతి పరీక్షలకు 60 మంది ఖైదీలు హాజరుకాగా అందులో 57 మంది పాసయ్యారు. అంటే 95 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన వారు 82.4 శాతం మార్కులు సాధించినట్లు జైలు అధికారులు తెలిపారు. అలాగే 12 వ తరగతి పరీక్షలకు 64 మంది ఖైదీలు హాజరవ్వగా అందులో 45 మంది పాసయ్యారు. అంటే 70.30 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ఆరుగురు ఖైదీలు ఫస్ట్ క్లాస్ మార్కులు దక్కించున్నారు.

అయితే బోర్ట్ పరీక్షలకు సిద్దమవుతున్న ఖైదీల కోసం వారు చదువుకునేందుకు ఏర్పాట్లు చేశామని సినీయర్ జైలు అధికారి ఒకరు తెలిపారు. అలాగే వాళ్లకి పనులు తక్కువగా అప్పగించామని దీనివల్ల వారు చదువుకునేందుకు సమయం దొరికినట్లు పేర్కొన్నారు. పరీక్షలు రాస్తున్న సమయంలో వారిని పనుల నుంచి మినహాయించామని తెలిపారు. జైలులోనే పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ అందించామని.. జైలులో లైబ్రరీ కూడా ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఖైదీలను పరీక్షలు రాసేందుకు మిగతా విద్యార్థుల్లాగ బయటకు పంపించలేదని.. ఈసారి 10 జైళ్లలో వారికోసం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..