ఐఐటీ విద్యార్థినిపై పోలీస్ ఏసీపీ అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. మాయమాటలతో లోబర్చుకుని వంచించినట్లు విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు వివాహమైందని, తనతో శారీరక సంబంధాలు పెట్టుకున్న విషయాన్ని దాచిపెట్టి ఏసీపీ ఎర వేసి పెళ్లి చేసుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, విచారణ కోసం అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ అర్చన సింగ్ నేతృత్వంలో సిట్‌ను కూడా ఏర్పాటు చేశారు.
కాన్పూర్‌లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ దారుణానికి ఒడిగట్టాడు. ఐఐటీ కాన్పూర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఏసీపీ కాన్పూర్ ఐఐటీలో సైబర్ క్రైమ్, క్రిమినాలజీ చదువుతున్నాడు. అక్కడ రీసెర్చ్ స్కాలర్‌తో సాన్నిహిత్యం పెరిగింది. ఆమెను ప్రేమలోకి దించి ఏసీపీ అత్యాచారం చేశాడని ఆరోపించారు. ఏసీపీకి వివాహం, ఇతర వాస్తవాలు వెలుగులోకి రావడంతో బాధితురాలు కాన్పూర్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.
పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ అంకితా శర్మ, ఏడీసీపీ అర్చన సింగ్ సివిల్ డ్రెస్‌లో కాన్పూర్ ఐఐటీలో విచారణ చేపట్టారు. మహిళా అధికారులిద్దరూ బాధితురాలిని విచారించగా, బాధితురాలు చెప్పిన దాంట్లో నిజం ఉందని తేలింది. ఈ విషయాన్ని ఇద్దరు మహిళా అధికారులు పోలీసు కమిషనర్ అఖిల్ కుమార్‌కు నివేదిక అందించారు. అత్యాచారం సహా తీవ్రమైన సెక్షన్ల కింద ఏసీపీపై కేసు నమోదు చేయాలని పోలీసు కమిషనర్ అఖిల్ కుమార్ ఆదేశించారు.
ఏసీపీని తక్షణమే లక్నో ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు డీసీపీ అంకితా శర్మ తెలిపారు. దీంతో పాటు ఏడీసీపీ ట్రాఫిక్ అర్చన నేతృత్వంలో సిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో కేసు దర్యాప్తు చేస్తున్నమని అంకితా శర్మ తెలిపారు. ఐఐటీలో పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో బాధితురాలితో ఏసీపీ ప్రేమలో ఉన్నట్లు నటించాడని ఆరోపిస్తున్నారు. పెళ్లి సాకుతో బాధితురాలితో శారీరక సంబంధాలు పెట్టుకున్న విషయాన్ని దాచిపెట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..