Covid-19: కరోనాతో అతలాకుతలం.. ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలను బలి తీసుకున్న కోవిడ్‌

|

Apr 30, 2021 | 9:48 PM

Covid-19: దేశంలో కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. సామాన్యుడి నుంచి ప్రముఖులను వెంటాడుతోంది. కరోనా ప్రముఖుల మరణాలకు దారి తీస్తోంది. ఇక కరోనా.

Covid-19: కరోనాతో అతలాకుతలం.. ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలను బలి తీసుకున్న కోవిడ్‌
Follow us on

Covid-19: దేశంలో కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. సామాన్యుడి నుంచి ప్రముఖులను వెంటాడుతోంది. కరోనా ప్రముఖుల మరణాలకు దారి తీస్తోంది. ఇక కరోనా ఉత్తరప్రదేశ్‌లో కల్లోలం చేస్తోంది. ఈ వైరస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. ఆ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంది.  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి మృతి చెందారు. వారిలో ఒకరు తాజాగా మృత్యువాత పడ్డారు. కరోనాపై తన వ్యాఖ్యలతో సంచలనం రేపిన ఎమ్మెల్యేనే కరోనా బారిన పడి కన్నుమూశారు. ఆయనే నవాబ్‌గంజ్‌ బీజేపీ ఎమ్మెల్యే కేసర్‌ సింగ్‌ గంగ్వార్‌ కరోనా బారిన పడి గురువారం మృతి చెందారు.

ఇక అంతకు ముందు ఆయన కరోనాపై పలు వ్యాఖ్యలు చేశారు. కరోనా ఎక్కడ ఉంది. అసలు మాస్క్‌లు ధరించడం అవసరమా..? అని అప్పట్లో ప్రశ్నించారు. అంతేకాకుండా గత సంవత్సరం, ఈ సారి కరోనా విజృంభిస్తున్నా కూడా ఆయన కనీసం మాస్క్‌ కూడా ధరించకుండా తిరిగారు. అంతకు ముందు ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మంత్రులు కరోనా బారిన పడి మృతి చెందారు. మంత్రులు చేతన్‌ చౌహన్, కమలరాణి వరుణ్‌, లక్నో పశ్చిమ ఎమ్మెల్యే సురేష్‌ శ్రీవాస్తవ, ఆరయ్య సదర్‌ ఎమ్మెల్యే రమేష్‌ దివాకర్‌ కరోనా బారిన పడి కన్నుమూశారు. వీరితో పాటు చాలా మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.

కాగా, ఇప్పటికే యూపీలో 12 లక్షలకుపైగానే పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లో కరోనా కట్టడిని ప్రభుత్వం తీవ్ర స్థాయిలో చర్యలు చేపడుతోంది. మాస్కులు లేనివారిపై చర్యలు చేపడుతోంది. కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు, నైట్‌ కర్ఫ్యూ విధిస్తోంది.

ఇవీ కూడా చదవండి:

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

Telangana Night Curfew: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నైట్‌ కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు.. ఎప్పటి వరకు అంటే..