ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్-ఖేరీ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు రైల్వే ట్రాక్‌పై నిలబడి ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేస్తుండగా, రైలు ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో భార్యాభర్తలు, వారి రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ ఘటన ఖేరీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం లక్నో నుంచి పిలిభిత్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఖేరీ సమీపంలో జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సీతాపూర్ జిల్లాలోని లాహర్‌పూర్‌కు చెందిన భార్యాభర్తలు తమ మూడేళ్ల కొడుకుతో కలిసి బుధవారం ఉదయం సోషల్ మీడియాలో రీల్ కోసం ప్రయత్నించారు. లఖింపూర్ ఖేరీలోని ఉమారియా గ్రామం సమీపంలో రైలు పట్టాల వద్ద మొబైల్‌లో వీడియో రికార్డ్ చేస్తుండగా రైలు వారిని ఢీకొట్టింది. దీంతో ఆ ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు.
వీరిలో భర్త మహ్మద్ అహ్మద్ (30), అతని భార్య నజ్మీన్ (24) తమ మూడేళ్ల మారుడు అక్రమ్‌ను ఒడిలో పెట్టుకుని రైల్వే బ్రిడ్జి దగ్గర రీల్ షుట్ చేస్తున్నారు. కానీ, రైలు వస్తున్న విషయం వారు గమనించలేదు. దీంతో రైలు కింద ముగ్గురు నుజ్జునుజ్జు అయ్యారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..