Viral News: వామ్మో ఇదేంటి భయ్యా.. ఇంట్లో ఇన్ని పాములా..?

యూపీలో భయానక ఘటన వెలుగు చూసింది. ఒక ఇంట్లో నుంచి అకస్మాత్తుగా 40 పాముల పిల్లలు బయటకు వచ్చాయి. ఇంట్లో పాములను చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. సమచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు 40 పాము పిల్లలను పట్టుకొని తీసుకెళ్లారు.

Viral News: వామ్మో ఇదేంటి భయ్యా.. ఇంట్లో ఇన్ని పాములా..?
Snakes

Updated on: Jul 27, 2025 | 3:45 PM

మనుషులే కాదు జంతువులు, క్షీరదాలు కూడా వేడి వాతావరణానికి తట్టుకోలేవు. అలాంటప్పుడు అవి నివసించేందుకు చల్లని ప్రదేశం కోసం వెతుకుతూ ఉంటాయి. ఎక్కడైనా వాటికి నివాసయోగ్యంగా అనిపిస్తే అక్కడే తిష్టవేస్తుంటాయి. ఇలానే మీరట్‌లోని సరస్వతి లోక్‌లో ఉన్న ఒక ఇంట్లోకి ఒక పాము ఫ్యామిలీ చేరింది. అయితే ఇక్కడికి వచ్చింది ఒకటి లేదా రెండు కాదు, దాదాపు 40 పాములు ఇంట్లోకి చేరాయి. అయితే తాజాగా ఈ పాములు ఇంట్లోని కుటుంబ సభ్యుల కంటపడ్డాయి. వాటిని చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

అయితే ఇంట్లో పాము పిల్లలు కనిపించిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో స్థానికంగా ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ విషయం అటవీశాఖ అధికారుల వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. ఉదయం దాదాపు 20 పాము పిల్లలను రక్షించారు. ఆ తర్వాత, మరికొన్ని పాము పిల్లలు బయటకు వచ్చాయని సమాచారం రావడంతో.. సాయంత్రం, ఆ బృందం మళ్ళీ ఘటనా స్థలానికి చేరుకుని దాదాపు 15 పాము పిల్లలను పట్టుకుంది. ఆ ఇంటి నుండి మొత్తం 40 పాము పిల్లలను పట్టుకున్న అటవీశాఖ అధికారులు వాటిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే ఒక్కాసారిగా ఇన్ని పాములు ఇంట్లోకి ఎలా వచ్చాయో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఘటనపై ఒక స్థానికుడు మాట్లాడుతూ.. సరస్వతి లోక్‌లో దొరికిన అన్ని పాము పిల్లలను రక్షించి సంబంధిత అటవీ ప్రాంతంలో వదిలివేసినట్లు తెలిపారు. ఇవన్నీ నీటిలో నివసించే పాములని ఆయన అన్నారు. అందువల్ల, ఈ పాములు వేడి కారణంగా నీటి నుండి బయటకు వచ్చి కొంతకాలం బయట ఉండగలవు, కానీ అవి నీటిలో ఉండటానికి ఇష్టపడతాయి. ఆ ప్రాంతంలోని కాలువ దగ్గర చాలా మురికి ఉందని, దాని కారణంగానే పిల్ల పాములు బయటకు వచ్చాయని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో వ్యాపించిన అనేక అపోహలను ఆయన తప్పుపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.