Modi-Trump: త్వరలో ప్రధాని మోదీ, డోనాల్డ్ ట్రంప్ భేటీ.. ఎప్పుడు, ఎక్కడ కలుసుకుంటారు?

సుంకాల యుద్ధం మధ్య, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సమావేశం సాధ్యమేనా? ఇద్దరు నాయకుల మధ్య సమావేశం భారతదేశం-అమెరికా సంబంధాలను పునరుద్ధరిస్తుందా? అనేక ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానాలు భారతీయులకే కాకుండా మొత్తం ప్రపంచం కూడా ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ-ట్రంప్ త్వరలోనే కలుసుకోబోతున్నట్లు సమాచారం.

Modi-Trump: త్వరలో ప్రధాని మోదీ, డోనాల్డ్ ట్రంప్ భేటీ.. ఎప్పుడు, ఎక్కడ కలుసుకుంటారు?
Pm Narendra Modi Donald Trump

Updated on: Sep 19, 2025 | 12:59 PM

సుంకాల యుద్ధం మధ్య, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సమావేశం సాధ్యమేనా? ఇద్దరు నాయకుల మధ్య సమావేశం భారతదేశం-అమెరికా సంబంధాలను పునరుద్ధరిస్తుందా? అనేక ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానాలు భారతీయులకే కాకుండా మొత్తం ప్రపంచం కూడా ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ-ట్రంప్ త్వరలోనే కలుసుకోబోతున్నట్లు సమాచారం. మలేసియా వేదికగా మోదీ-ట్రంప్‌ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్‌ సిందూర్ అనంతరం ఇరుదేశాధినేతలు మొదటిసారి భేటీ కాన్నారు.

ఆపరేషన్‌ సిందూర్‌పై డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యలు, భారత్‌పై భారీగా సుంకాల విధింపు వేళ ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే నెల అక్టోబర్‌లో మలేషియాలో జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య ముఖాముఖి సమావేశం జరిగే అవకాశం ఉంది. అయితే ఈ నెల చివర్లో న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) సమావేశానికి ప్రధాని మోదీ హాజరు కావడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అయితే, మలేషియాలో ట్రంప్-మోదీ సమావేశం గురించి ఇప్పటివరకు అధికారిక చర్చలు జరగలేదు. అంతేకాకుండా, ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి ఇద్దరు నాయకుల హాజరును ఇటు భారత్ అటు అమెరికా అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ, ప్రధానమంత్రి మోదీ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలకు హాజరవుతున్నట్లు సమాచారం. ఈసారి కూడా ఆయన పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంతలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చే నెలలో మలేషియాను సందర్శిస్తారని మలేషియా ప్రధానమంత్రి దాతుక్ సెరి అన్వర్ ఇబ్రహీం ధృవీకరించారు. “అధ్యక్షుడు ట్రంప్ వచ్చే నెలలో మలేషియాను సందర్శించి 47వ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతానని ఫోన్ చేశారు” అని అమ్ బ్యాంక్ గ్రూప్ స్వర్ణోత్సవ వేడుకల్లో మలేషియా ప్రధాని అన్వర్ అన్నారు.

ఈ శిఖరాగ్ర సమావేశానికి చైనా ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ కూడా హాజరవుతారు. ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం (అక్టోబర్ 26-28) సందర్భంగా మోదీ, ట్రంప్ కలుసుకుంటే, నవంబర్‌లో భారతదేశంలో జరగనున్న క్వాడ్ నాయకుల శిఖరాగ్ర సమావేశానికి సన్నద్ధం కావడంలో అది కీలకం కావచ్చు. క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి ట్రంప్ భారతదేశాన్ని కూడా సందర్శించవచ్చని భావిస్తున్నారు. ప్రధాని మోదీ, డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడు, ఎక్కడ కలుసుకుంటారు? దీపావళి నాడు ఈ ఇద్దరు స్నేహితులు కలుస్తారా? అన్నదీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇటీవల భారతదేశంలో నియమితులైన అమెరికా రాయబారి సెర్గియో గోర్, అధ్యక్షుడు ట్రంప్ క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి, ముఖ్య నాయకుల సమావేశానికి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. అయితే, ఆయన ఎటువంటి తేదీలను నిర్ధారించలేదు. గతంలో, జూన్ 17న జరిగిన ఫోన్ సంభాషణలో, ట్రంప్ భారతదేశాన్ని సందర్శించాలన్న ప్రధాని మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారు. ప్రస్తుతం, ట్రంప్ ప్రయాణ ప్రణాళికలకు సంబంధించి భారతదేశానికి వాషింగ్టన్ నుండి ఎటువంటి అధికారిక సూచనలు అందలేదు. ఇప్పుడు అందరి దృష్టి మలేషియాలో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంపై ఉంది. ఇక్కడ ట్రంప్-మోదీ మధ్య సమావేశం ప్రపంచ దౌత్యానికి ప్రధాన సంకేతంగా మారబోతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..