
ఒక పెళ్లి వేడుకలో చికెన్ ఫ్రై కోసం ఇరు వర్గాల కుటుంబ సభ్యులు పొట్టుపొట్టు కొట్టుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ జిల్లాలో వెలుగు చూసింది. కుటుంబ సభ్యుల మధ్య ఆనందకరమైన వివాహ వేడుకగా జరగాల్సిన పెళ్లి ఈ వివాదంతో పోలీసుల సమక్షంలో ముగిసింది. వివరాలలోకి వెళ్తే..యూపీలోని బిజ్నోర్ జిల్లాకు చెందిన ఒక యువతీ, యువకుడి వివాహం జరుగుతుంది. ఈ క్రమంలో భోజనాలు వడ్డిస్తుండగా చికెన్ ఫ్రైస్ వడ్డించే విషయంలో వరుడు, వధువు కుటుంబ సభ్యుల మధ్య వివాదం చెలరేగింది. మాటా మాటా పెరిగి ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్లింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అడ్డుకొని శాంతింపజేశారు. తర్వాత ఇరు కుటుంబాలతో మాట్లాడి సమస్యను సర్దుమణిగించారు. దీంతో కుటుంబసభ్యుల మధ్య సంతోషంగా జరగాల్సి పెళ్లి వేడుక పోలీసుల సమక్షంలో ముగిసింది. ఈ ఘటనపై ఒక ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. మేము ఒక పెళ్లికి వచ్చాము. భోజనాలు చేసే సమయంలో చికెన్ ఫ్రై కౌంటర్ వద్ద వివాదం చెలరేగింది. అతిథులు చికెన్ ఫ్రైస్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, గొడవ జరిగింది. అక్కడ మహిళల, పిల్లలు కూడా ఉన్నారు, గొడవ కారణంగా తొక్కిసలాట కూడా జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారని తెలిపారు.
వీడియో చూడండి..
बिजनौर में शादी में चिकन फ्राई को लेकर बारातियों में भिड़ंत! मैरिज हॉल में जमकर हुई मारपीट, कई लोग घायल pic.twitter.com/YZW1nx5irk
— news for you (@newsforyou36351) November 3, 2025
అయితే అక్కడే ఉన్న కొంత మంది ఈ తతంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోలలో కొందరు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం మనం చూడవచ్చు., మరికొందరు అరుస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. అప్పుడే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకొని సమస్యను సద్దుమణిగించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.