యూపీ పాపులేషన్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇది రాజ్యాంగంలోని 21 వ అధికరణానికి వ్యతిరేకమన్నారు. ఏ వ్యక్తి జీవితాన్ని గానీ, అతని వ్యక్తిగత స్వేచ్ఛను గానీ హరింపజేయజాలరన్నారు. ఈ బిల్లు మహిళలకే హాని చేస్తుందని, తాము ఎలాంటి వైఖరి పాటించాలో నిర్ణయించుకునే హక్కు వారికి హక్కు ఉంటుందని ఆయన చెప్పారు. 2020 డిసెంబరు నాటి తమ అఫిడవిట్ లో బీజేపీ-దేశంలో ఫలదీకరణ రేటు తగ్గినందున ఇద్దరు బిడ్డల పాలసీ అన్నది ఉండదని స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు. కానీ యూపీ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తోందని ఒవైసీ ఆరోపించారు. ఈయనతో బాటు దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ అనే ఇస్లామిక్ సంస్థ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదన సమాజంలోని ప్రతి వ్యక్తి సెంటిమెంటును దెబ్బ తీస్తుందని విమర్శించింది .
అయితే వీరి వాదనలను కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యన్ ఖండించారు. ఈ సమస్యలోకి మతాన్ని ఎందుకు లాగుతారని ఆయన ప్రశ్నించారు. దేశ జనాభా విపరీతంగా పెరిగిపోతోందని, దీన్ని అదుపు చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. వనరులు పరిమితంగా ఉన్నాయన్న విషయాన్ని విస్మరించకండి అని ఆయన పేర్కొన్నారు. అటు యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించిన పాపులేషన్ కంట్రోల్ పాలసీని ఏబీవీపీ స్వాగతించగా విశ్వ హిందూ పరిషద్ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. మొదట అన్ని వర్గాలతో సంప్రదించి ఉండాల్సిందని ఈ సంస్థ అభిప్రాయపడింది. కాగా-అస్సాం కూడా ఈ విధమైన ప్రతిపాదన చేసింది. ఇద్దరు బిడ్డల పాలసీని అమలు చేస్తామని ప్రకటించింది. కర్ణాటకలో కూడా ఇలాంటి ప్రతిపాదన మొగ్గ దశలో ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: బెంగాల్ లో ఎన్నికల అనంతర హింస నిజమే.. జాతీయ మానవ హక్కుల సంఘం నిర్ధారణ.. మమత ఖండన
Breaking: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి తేదీ ఖరారు..