Buffalo: విచిత్ర కేసు.. గేదెకు డీఎన్‌ఏ టెస్టు! ఎందుకో తెలిస్తే ఫ్యూజులౌట్..

|

Jun 06, 2022 | 9:34 PM

ఉత్తరప్రదేశ్‌లో విచిత్రమైన కేసులో గేదెకు డీఎన్‌ఏ టెస్టులు నిర్వహించనున్నారు. నిజానికి యూపీలోని సహరాన్‌పూర్‌ జిల్లాకు చెందిన..

Buffalo: విచిత్ర కేసు.. గేదెకు డీఎన్‌ఏ టెస్టు! ఎందుకో తెలిస్తే ఫ్యూజులౌట్..
Buffalo
Follow us on

DNA test for buffalo: ఉత్తరప్రదేశ్‌లో విచిత్రమైన కేసులో గేదెకు డీఎన్‌ఏ టెస్టులు నిర్వహించనున్నారు. నిజానికి యూపీలోని సహరాన్‌పూర్‌ జిల్లాకు చెందిన చంద్రపాల్ కశ్యప్ అనే వ్యక్తి 2020 ఆగస్టు 25న తన పశువుల కొట్టం నుండి మూడేళ్ల మగ గేదె దొంగతనానికి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2020 నవంబర్‌లో పక్కనే ఉన్న బీన్‌పూర్ గ్రామంలో దొంగిలించబడిన గేదెను కనుగొన్నారు. ఐతే సదరు గేదె తనదని, దానిని ఇవ్వడానికి నిరాకరించాడు కొత్త యజమాని సత్బీర్ సింగ్. ఆ తర్వాత కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఈ వివాదం వాయిదా పడింది. ఇప్పుడు యజమానులిద్దరూ గేదె నాది అంటే నాదని వాదులాడుకోవడంతో రంగంలోకి దిగిన షామ్లీ పరిధిలోని ఎస్పీ సుకృతి మాధవ్‌ అసలైన యజమానిని నిర్ధారించడానికి గేదెకు, దాని తల్లికి (కశ్యప్‌ వద్దనున్న గేదె తల్లి) డీఎన్‌ఏ టెస్టు నిర్వహించాలని ఆదేశించాడు.

మీమాంసలో పశుసంవర్ధక శాఖ అధికారులు
ఒక జంతువుపై ఇటువంటి పరీక్షలు గతంలో ఎప్పుడూ చేయలేదని స్థానిక పశుసంవర్ధక శాఖ అధికారులు తలలు పట్టుకున్నారు. ఐతే హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి గేదె, దాని తల్లి నుంచి సేకరించిన నమూనాలను ద్వారా డీఎన్ఏ టెస్టు చేయవచ్చన్నారు. ఫలితాల వెల్లడి అనంతరం అసలు యజమానిని గుర్తించవచ్చని తెలిపారు. ఈ మేరకు గేదె, దాని తల్లి నమూనాలను సేకరించి టెస్టుల నిమిత్తం హైదరాబాద్‌కు పంపనున్నట్లు మీడియాకు తెలిపారు.