CM Yogi Temple: అయోధ్యలో యోగి అదిత్యనాధ్ కి గుడి.. నిర్మాణంలో భాగస్వామ్యం కానున్న స్థానిక ముస్లీంలు

యోగి ఆదిత్యనాథ్ ఆలయానికి భూమి పూజను ఫిబ్రవరి 24న నిర్వహించడానికి ప్లాన్ చేశాడు. ఆ కార్యక్రమంలోని విశిష్టత ఏమిటంటే, హిందువులే కాకుండా..  ఈ ప్రాంతంలోని ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు కూడా ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్నారు

CM Yogi Temple: అయోధ్యలో యోగి అదిత్యనాధ్ కి గుడి.. నిర్మాణంలో భాగస్వామ్యం కానున్న స్థానిక ముస్లీంలు
Up Cm Yogi Temple In Up
Follow us
Surya Kala

|

Updated on: Jan 19, 2023 | 8:41 PM

దేవుళ్ళకు ఆలయాలను నిర్మించి పూజించే సంప్రదాయం పూర్వకాలం నుంచి ఉన్నదే.. అయితే గత కొంతకాలం క్రితం తాము ఇష్టపడిన హీరో హీరోయిన్ల కు గుడులు నిర్మించే ఫ్యాన్స్ ని చూసాం.. అంతేకాదు తమకు అత్యంత ప్రాణ సమానులైన తల్లిదండ్రులు, భర్త భర్తలు లేదా పిల్లల జ్ఞాపకార్ధం వారి విగ్రహాలను తయారు చేసి పూజిస్తున్న ఫ్యామిలీ సభ్యుల గురించి తరచుగా వార్తలు వింటూనే ఉన్నాం.. అయితే ముఖ్యమంత్రి చేసే పనులకు ముగ్ధుడైన ఓ అనుచరుడు ఏకంగా తన అభిమాన సిఎం కు ఓ భారీ ఆలయాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మరి ఆ ముఖ్య మంత్రి ఎవరు.. అనుచరుని ఆలోచనకు మద్దతు ఎవరు ఇస్తున్నారో చూద్దాం..

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పనికి ముగ్ధుడైన ఆయన అనుచరుల్లో ఒకరు యోగికి అంకితం చేస్తూ భారీ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. యోగికి వీరాభిమాని అయిన ప్రభాకర్ మౌర్య అనే వ్యక్తి అయోధ్య జిల్లా శివార్లలోని భదర్సా ప్రాంతంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు అంకితం చేస్తూ ఓ ఆలయాన్ని నిర్మించాలని భావించాడు. 4 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ  ఆలయాన్ని నిర్మించనున్నట్లు మౌర్య తెలిపారు. “ఈ ఆలయం 101 అడుగుల ఎత్తు.. 50 అడుగుల పొడవు వెడల్పులు ఉంటుంది. ఈ ఆలయంలో యుపి ముఖ్యమంత్రి జీవిత పరిమాణ క్రమాన్ని తేలిపోనుంది. అంతేకాదు యోగిని పూజిస్తూ.. ధ్యానం చేస్తూ.. ప్రార్థనలు నిర్వహించనున్నామని మౌర్య చెప్పారు.

“యోగి అభిమాని తాను రెండేళ్ల క్రితం ఇలాంటి ఆలయాన్ని నిర్మించానని.. అయితే అది నిర్మించిన భూమి యాజమాన్యానికి సంబంధించిన కొన్ని వివాదాల కారణంగా దానిని మూసివేయాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో ఈసారి మౌర్య తన సొంత స్థలంలో ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. యోగి ఆదిత్యనాథ్ ఆలయానికి భూమి పూజను ఫిబ్రవరి 24న నిర్వహించడానికి ప్లాన్ చేశాడు. 2027 నాటికి నిర్మాణం పూర్తవుతుందని మౌర్య పేర్కొన్నారు. అయితే ఆ కార్యక్రమంలోని విశిష్టత ఏమిటంటే, హిందువులే కాకుండా..  ఈ ప్రాంతంలోని ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు కూడా ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్నారు. మద్దతు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..