Uttar Pradesh DGP: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల రెండోసారి ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. యోగి ఆదిత్యనాథ్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులను పరుగులు పెట్టిస్తూ గుబులు పుట్టించాడు. ఏ చిన్న సమస్యల తలెత్తినా.. కఠినంగా వ్యవహరిస్తారు. మొదటి నుంచి ఆయన తీసుకునే నిర్ణయాలన్ని సంచలనమే. అధికారులపై కొరఢా ఝులిపిస్తూ తన మార్క్‌ను చాటుకున్నారు. ఇక బుధవారం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఆదేశాలు అమలు చేయడం లేదన్న కారణంతో ఆ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) ముకుల్ గోయల్ (Mukul Goyal)ను ఆ పదవి నుంచి తప్పించారు. డిపార్ట్‌మెంటల్ పనులపై ఆసక్తి చూపకపోవడం, ప్రభుత్వ పనులను పట్టించుకోకపోవడం వల్లే డీజీపీ పదవి నుంచి రిలీవ్ చేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముకుల్ గోయెల్‌ను సివిల్ డిఫెన్స్ డీజీ పోస్టుకు పంపినట్లు తెలుస్తోంది. అదనపు డైరెక్టర్ జనరల్ (ADG), లా అండ్ ఆర్డర్, ప్రశాంత్ కుమార్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే భారత్‌లో అతిపెద్దదైన యూపీ.. ప్రపంచంలోనే అతిపెద్ద పోలీసు బలగాలను కలిగి ఉంది. గోయల్ ఇప్పుడే కాదు.. తన కెరీర్‌లో రెండు సార్లు సస్పెండ్ అయ్యారు. గోయల్‌కు మంచి మంచి అవార్డులు కూడా వరించాయి. ఇతర మంచి సేవా పథకాలను కూడా అందుకున్న వ్యక్తి గోయల్. అలాంటి వ్యక్తి ఇప్పుడు సస్పెండ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒక ఉన్నతమైన డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలగించడం దేశ వ్యాప్తంగా సంచనలంగా మారింది. గోయల్‌పై బలమైన ఆరోపణలు ఉన్నందునే సస్పెండ్‌కు గురైనట్లు సమాచారం. యూపీలో నేరాలు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, కశ్మీర్‌లను మించిపోయింది. అయితే పోలీసు వ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉన్న పోలీసు అధికారుల బదిలీలు జరగడం అనేవి చాలా అరుదు. కానీ గోయల్‌పై వస్తున్న ఆరోపణలు సమంజసమేనా..? అనే చర్చ జరుగుతోంది.
అనేక వివాదాల్లో డీజీపీ ముకుల్ గోయల్:
కాగా, యూపీ డీజీపీ ముకుల్ గోయల్ కూడా ఇంతకు ముందు అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. అతని పనితీరుపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. 2000 సంవత్సరంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే నిర్భయ్ పాల్ శర్మ హత్యకు గురైనప్పుడు.. ఆ సమయంలో ముకుల్ గోయల్ ఎస్‌ఎస్‌పీ (SSP)గా ఉన్నారు. ఈ హత్య నేపథ్యంలో ఆయన పలు ఆరోపణలు ఉండటంతో.. ఆ పదవి నుండి సస్పెండ్ అయ్యారు. అలాగే.. 2003-07 నాటి పోలీసు రిక్రూట్‌మెంట్ కుంభ కోణంలో గోయల్ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 2007లో అప్పటి ముఖ్యమంత్రి మాయావతి అతనితో పాటు మొత్తం 25 మంది IPS అధికారులను సస్పెండ్ చేశారు. అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ డీజీపీగా తన నియామకానికి వ్యతిరేకంగా అవినాష్ ప్రకాశ్ పాఠక్ అనే వ్యక్తం హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు. ఈ కుంభ కోణంపై మహానగర్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది.
రెండేళ్ల పదవీ కాలం పూర్తి కాకముందే..
రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడం, దూషించడం వంటి ఆరోపణలున్నాయి. ప్రత్యేకించి సమాజ్ వాదీ పార్టీ సభ్యులతో దూషించడం అనే నిరాధారణమైన ఆరోపణలు గోపాల్‌పై ఉన్నాయి. ముజఫర్‌నగరలో మతపరమైన అల్లర్లు చెలరేగినప్పుడు గోయల్ డీజీపీగా ఉన్నారు. గతంలో పోలీసు స్టేషన్ స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు మాయావతి శాంతి భద్రతలను మెరుగుపర్చడం కోసం మొత్తం పోలీసు అధికార వ్యవస్థను మార్చారు. గత 12 ఏళ్లలో నిబంధనల ప్రకారం రెండేళ్ల పదవీ కాలం పూర్తి కాకముందే ఆ పదవీ నుంచి తొలగించబడిన నాలుగో డీజీపీ గోయల్. 2012లో అప్పటి ముఖ్యమంత్రి మాయావతితో సన్నిహితంగా ఉన్నందుకు ఎన్నికల సంఘం డీజీపీ బ్రిజ్‌లాల్‌ను అసెంబ్లీ ఎన్నికలకు ముందు బదిలీ చేసింది.
ఇంతకీ ముకుల్ గోయల్ ఎవరు?
ముకుల్ గోయల్ 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తన సుదీర్ఘ కెరీర్‌లో ఆయన అనేక ముఖ్యమైన స్థానాల్లో విధులు నిర్వహించారు. గోయల్ 1964 ఫిబ్రవరి 22న యూపీలోని ముజఫర్‌నగర్‌లో జన్మించారు. ఐఐటీ ఢిల్లీ నుండి ఎలక్ట్రికల్‌లో B.Tech చేయడంతో పాటు, ముకుల్ గోయల్ మేనేజ్‌మెంట్‌లో MBA పట్టా పొందారు. 1987 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి, ముకుల్ గోయల్ మొదటి పోస్టింగ్ నైనిటాల్‌లో అదనపు ఎస్పీగా పనిచేశారు. ఆ తరువాత బరేలీ SP గా విధులు నిర్వహించారు. 2021 జూన్ 1న డీజీపీగా నియమితులయ్యారు. అయితే అంతకు ముందు సరిహద్దు భద్రతా దళం (BSF)కు నేతృత్వం వహించారు గోయల్, దీనికి ముందు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, ఎన్డీఆర్పీలో ఉన్నారు. అల్మోరా, జలౌన్, మైన్‌పురి, హత్రాస్, అజంగఢ్, గోరఖ్‌పూర్, వారణాసి, సహరాన్‌పూర్, మీరట్ జిల్లాల్లో ఎస్పీ, ఏఎస్పీగా గతంలో పని చేశారు. ఆయనకు ఫ్రెంచ్ భాషపై కూడా విపరీతమైన పట్టు ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి