అన్ లాక్ 4.0 , కర్నాటకలో తెరుచుకోనున్న పబ్ లు, బార్లు !

| Edited By: Pardhasaradhi Peri

Aug 31, 2020 | 5:24 PM

అన్ లాక్ 4.0 గైడ్ లైన్స్ ప్రకారం కర్నాటకలో సెప్టెంబర్ 1 నుంచి పబ్ లు, బార్లు, క్లబ్బులు తెరచుకోనున్నాయి. ఇందుకు రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో..

అన్ లాక్ 4.0 , కర్నాటకలో తెరుచుకోనున్న పబ్ లు, బార్లు !
Follow us on

అన్ లాక్ 4.0 గైడ్ లైన్స్ ప్రకారం కర్నాటకలో సెప్టెంబర్ 1 నుంచి పబ్ లు, బార్లు, క్లబ్బులు తెరచుకోనున్నాయి. ఇందుకు రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో మద్యం సరఫరా కూడా ఉంటుంది. 5 నెలల తరువాత రాష్ట్రంలో మళ్ళీ వీటికి అనుమతి లభించింది. ఇంతకాలం మూసి ఉంచినందువల్ల తమ ప్రభుత్వ ఖజానాకు రూ. 1435 కోట్ల నష్టం వఛ్చినట్టు ఎక్సయిజు శాఖ  మంత్రి నగేష్ తెలిపారు. ఒకవేళ ఇప్పుడు కూడా లిక్కర్ అమ్మకాలకు పర్మిషన్ ఇవ్వకపోతే నష్టం 3 వేల కోట్లకు పెరిగిపోతుందని ఆయన చెప్పారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి తమ శాఖ రెవెన్యూ టార్గెట్ రూ. 22,700 కోట్లని ఆయన పేర్కొన్నారు. ‘ఇక ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రంలో బార్లు, పబ్ లు, క్లబ్బులు మందుబాబులతో మళ్ళీ ‘కళ కళ లాడనున్నాయి’.