రైల్వే స్టేషన్ పేరునే మార్చేసిన ఆకతాయిలు

మహారాష్ట్రలో దుండగులు రెచ్చిపోయారు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్లో కొందరు ప్లాట్ ఫారం మీద ఉన్న బోర్డుపై ఉన్న పేరునే మార్చేశారు. ఔరంగాబాద్ పేరుపై రంగు పూసి.. దానిపై సంభాజీ నగర్ అని రాశారు. ఈ ఘటనపై పోలీసులు, రైల్వే అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఘటనలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారని తెలిపారు. […]

రైల్వే స్టేషన్ పేరునే మార్చేసిన ఆకతాయిలు

Edited By:

Updated on: Jul 01, 2019 | 1:49 PM

మహారాష్ట్రలో దుండగులు రెచ్చిపోయారు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్లో కొందరు ప్లాట్ ఫారం మీద ఉన్న బోర్డుపై ఉన్న పేరునే మార్చేశారు. ఔరంగాబాద్ పేరుపై రంగు పూసి.. దానిపై సంభాజీ నగర్ అని రాశారు. ఈ ఘటనపై పోలీసులు, రైల్వే అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఘటనలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారని తెలిపారు. బోర్డుపై మొదట రంగు పూశారని.. ఆ తర్వాత సంభాజీనగర్ అనే పేరు ఉన్న స్టిక్కర్‌ను అతికించారని వెల్లడించారు.