US Visa: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రికార్డ్ స్థాయిలో యూఎస్ వీసాలు

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థులకు ఓ మంచి శుభవార్త అందింది. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఇండియాకు చెందిన విద్యార్థులకు అమెరికా రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసింది. అయితే అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తు చేసుకున్నటువంటి భారతీయ విద్యార్థులకు దాదాపు 90,000 కంటే ఎక్కువగా వీసాలను జారీ చేసినట్లు భారత్‌లోని యూఎస్‌ మిషన్ ‘ఎక్స్‌’ (ట్విటర్)లో పేర్కొంది.

US Visa: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రికార్డ్ స్థాయిలో యూఎస్ వీసాలు
Us Visa

Updated on: Sep 25, 2023 | 8:08 PM

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థులకు ఓ మంచి శుభవార్త అందింది. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఇండియాకు చెందిన విద్యార్థులకు అమెరికా రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసింది. అయితే అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తు చేసుకున్నటువంటి భారతీయ విద్యార్థులకు దాదాపు 90,000 కంటే ఎక్కువగా వీసాలను జారీ చేసినట్లు భారత్‌లోని యూఎస్‌ మిషన్ ‘ఎక్స్‌’ (ట్విటర్)లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా అమెరికా జారీ చేసినటువంటి ప్రతి నాలుగు స్టూడెంట్‌ వీసాలలో ఒకటి భారతీయ విద్యార్థులకే జారీ అయినట్లు యూఎస్‌ మిషన్‌ తెలిపింది. అలాగే ఉన్నత విద్య లక్ష్యాలను సాకారం చేసుకునే విషయంలో చూసుకుంటే.. యునైటెడ్ స్టేట్స్‌ను ఎంచుకున్న విద్యార్థులందరికీ అభినందనలని.. శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేసింది.

అయితే ప్రస్తుత సెషన్ కోసం స్టూడెంట్‌ వీసా దరఖాస్తులు ముగిసిన సందర్భంలో యూఎస్‌ మిషన్‌ ఈ గణాంకాలను విడుదల చేసేసింది. మరోవిషయం ఏంటంటే.. 2022లో అమెరికాలోని అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులతో ప్రపంచంలోని అగ్ర దేశంగా ఇదివరకు చైనా ఉండేంది. అయితే ఇప్పుడు చైనాను భారత్ అధిగమించింది. అలాగే 2020లో దాదాపు 2,07,000 మంది అంతర్జాతీయ భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా క్రమంగా పెరుగిపోతోందని.. తాజా నివేదిక తెలిపింది. ఇండియా నుంచి విద్యార్థులను ఆకర్షించేందుకు విదేశీ యూనివర్శిటీలు అందించే సులభతరమైన అప్లికేషన్ ఫార్మాలిటీలు.. అలాగే ఆర్థిక సాయం, స్కాలర్‌షిప్‌లు ఈ పెరుగుదలకు కారణంగా ఉన్నట్లు సమాచారం. అయితే గతంలో కూడా ఫ్రాన్స్ ఇండియా నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులను ఉన్నత విద్య కోసం తమ దేశానికి స్వాగతించాలనే లక్ష్యం కూడా పెట్టుకున్నట్లు పేర్కొంది. ఇక 2030వ సంవత్సరం నాటికి భారతీయ విద్యార్థుల సంఖ్యను పెంచడం కోసం ఆ దేశం ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. అలాగే విద్యా నైపుణ్యాన్ని, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించేలా చేయడం ద్వారా ఈ లక్ష్యం నెరవేరనుంది. అలాగే రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక స్నేహాన్ని పెంపొందించడం వల్ల కూడా లక్ష్యం సాధ్యమవుతుంది.

ఇవి కూడా చదవండి