ఆ ఊరిలో ఒకే ఒక్క వినాయకుడు.. భక్తుల ఇంటికే వచ్చి పూజలందుకుంటాడు.. ఎక్కడో తెలుసా?
వినాయక చవితి వచ్చిందంటే చాలా పల్లె అయినా, పట్టణమైనా ఇంటింటా, వీధివీధీనా వినాయక విగ్రహాలు దర్శనమిస్తాయి. పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ స్వామి వారి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. కానీ ఈ గ్రామంలో మాత్రం వినాయక చవితి ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. మనం వీధికి ఒక్క గణపతి పెడితే.. ఇక్కడ మాత్రం ఊరంతా కలిసి ఒకే గణపతిని పూజిస్తారట. ఇంతకు ఈ గ్రామం ఎక్కడో ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు ఇది చదివేయండి.

ముంబై అంటేనే వినాయక చవితి ఉత్సవాలకు పెట్టింది పేరు. ఎందుకంటే ఇక్కడి ప్రాంతంలో వినాయక చవితి వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు స్థానికులు. వీధివీధీనా రకరకాల గణేషులను ఏర్పాటు చేసి, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పూజిస్తారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో గణపయ్య విగ్రహాన్ని పెట్టుకొని ప్రత్యేకంగా చవితి వేగుకలు చేసుకుంటారు. కానీ, రాయ్‌గఢ్ జిల్లాలోని మాంగావ్ తహసీల్‌లోని సేల్ అనే గ్రామంలో మాత్రం చవితి వేడుకలు భిన్నంగా జరుగుతాయి. ఈ గ్రామంలో మొత్తం 200 వరకు నివాసాలు ఉంటాయి. కానీ ఏ ఒక్కరు తమ ఇంట్లో కానీ, తమ వీధుల్లో కానీ గణేష్ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పూజించరు. గ్రామంలో ఒకటే విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఊరంతా పూజిస్తారు. ఈ గ్రామంలో గత శతాబ్ధాలు ఈ సాంప్రదాయం కొనసాగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు.
వినాయక చవితి మొదటి రోజునా గ్రామస్థులంతా ఊర్లో ఉన్న వినాయకుడి ఆలయం వద్ద వచ్చి అక్కడి సాంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు. ఆ తర్వాత గంగా నది నుంచి గణేష్ విగ్రహాన్ని పల్లకిలో మేళ తాళాలతో ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకోస్తారు. ఈ క్రమంలో స్వామివారిని గ్రామస్తులందరూ ఇంటిటింకీ ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రామంలోని అన్ని ఇళ్లు పూర్తయిన తర్వాత స్వామివారిని ఆయలంలోకి తీసుకెళ్తారు.
ఈ పండగ కోసం గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి బ్రతికేవారు, పెళ్లై వెళ్లిపోయిన ఆడపిల్లలు సైతం కుటుంబ సమేతంగా వచ్చిన స్వామివారిని దర్శించుకుంటారు. వీరే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి, ముంబై, పూణే నగరాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ పూజలో పాల్గొంటారు. ఇక్కడ కొన్ని వందల ఏళ్లుగా ఈ ఒకే గ్రామం.. ఒకే గణపతి అనే సాంప్రదాయం కొనసాగుతుందని స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




