Kishan Reddy: భారత దేశ కళలను గుర్తించండి.. దేవాలయాలపై శిల్ప కళ అద్భుతం..

|

Nov 15, 2021 | 9:20 AM

కేంద్ర పర్యటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి దేశంలోని దేవాలయాల గురించి ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో వివిధ దేవాలయాలు ఉన్నాయి...

Kishan Reddy: భారత దేశ కళలను గుర్తించండి..  దేవాలయాలపై శిల్ప కళ అద్భుతం..
Kishanreddy
Follow us on

కేంద్ర పర్యటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి దేశంలోని దేవాలయాల గురించి ఓ వీడియోను పోస్ట్ చేశారు. దేశంలోని కళలను గుర్తించండి అని అన్నారు. ఈ వీడియోలో వివిధ దేవాలయాలు ఉన్నాయి. ఆలయాల్లో అద్భుతమైన వాస్తుశిల్పం, దాని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, పురాతన ఇతిహాసాలు, దేవాలయాలపై క్లిష్టమైన శిల్పాలు, చిహ్నాలతో అలంకరించబడి ఉన్నాయని ట్వీట్‎లో రాశారు.

వీడియోలో రాజస్థాన్‎లోని‎ నిమ్రన అల్వర్ కట్టడం, కర్టాటక చిక్‎మంగుళూరులోని అన్నపూర్ణేశ్వరి దేవాలయం, గోవాలోని 12వ శతాబ్దం బ్లాక్ బసల్ట్ మహదేవ్ మందిర్, మౌరిటియస్‎లోని 108 అడుగుల వెకంటేశ్వర స్వామి విగ్రహం, తమిళనాడు కుంభకోణంలోని 12వ శతాబ్దం ఎయిరవతేశ్వర్ ఆలయం, కర్ణాటకలోని హలిబింద్ హయిలేశ్వర గణేష్ విగ్రహం, మహారాష్ట్రోలని బిర్ల గణపతి దేవాలయం సహా ఇతర పురాతన కట్టడాలు ఉన్నాయి.

Read Also.. Sindhu Pushkaram: పుష్కర శోభను సంతరించుకోనున్న సింధు నది.. ఈ నెల 20 నుంచి సింధు నది పుష్కరాలు ప్రారంభం..