
దేశంలోనే అతిపెద్ద టీవీ9 నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ 2024కి హాజరైన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, తాను క్రికెటర్‌ని కావాలనుకున్నానని, అయితే రాజకీయనాయకుడిగా మారానని చెప్పారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘నేను క్రికెటర్‌ని కావాలనుకున్నాను, మా నాన్న నన్ను సైన్యంలోకి పంపాలనుకున్నారు, కానీ నేను నాయకుడిని అయ్యాను. కానీ ప్రస్తుతం దేశంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. నేడు ప్రభుత్వం ఖేలో ఇండియాతో సహా అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇక్కడ ఆటగాళ్లకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, దాని ఫలితాలను మనం ప్రస్తుతం స్వయంగా చూస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.
ఆసియా క్రీడల్లో భారత్ 100కు పైగా పతకాలు సాధించడం ఇదే తొలిసారి అని మంత్రి అన్నారు. అంతకుముందు ఆటగాళ్లు చాలా సమస్యలను ఎదుర్కొనేవారు, కానీ నేడు ఖేలో ఇండియా, TOPS పథకం కింద, ప్రభుత్వమే ఆటగాళ్ల మొత్తం ఖర్చులను భరిస్తోందని చెప్పుకొచ్చారు. అనురాగ్ ఠాకూర్ ఇంకా మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వాల నుంచి సహాయం అందితే, మరిన్ని అద్భుతాలు చేయొచ్చని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. తాను క్రికెట్‌ను వదిలిపెట్టాలని అనుకోలేదని, అయితే కుటుంబ పరిస్థితులు ఆటకు దూరమయ్యేలా చేశాయని మంత్రి గుర్తుచేసుకున్నారు. 25 ఏళ్ల వయసులో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యానని, దీని తరువాత, 26 సంవత్సరాల వయస్సులో ధర్మశాలలో క్రికెట్ స్టేడియం నిర్మించామని చెప్పుకొచ్చారు.
హార్డ్ గేమ్ వర్సెస్ సాఫ్ట్ పవర్ అనే ప్రశ్నపై మంత్రి స్పందిస్తూ.. మన వైపు నుండి మనం ఏ రాయిని వదిలిపెట్టకూడదని కేంద్ర మంత్రి అన్నారు. ఆటగాళ్లు ఏం చేయాలో అది చేస్తారు, ప్రభుత్వం తరఫున తాము చేయాల్సింది చేస్తామని చెప్పుకొచ్చారు. ఖేలో ఇండియా అకాడమీలో శిక్షణకు రూ.5 లక్షలు, పాకెట్ మనీకి రూ.లక్ష అందిస్తున్నాము. ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ అందడంలో ఇది ఉపయోగపడుతుంది. నేడు దేశవ్యాప్తంగా 1075 కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
ఇక ఇదే సమయంలో రాజకీయాలకు సంబంధించి.. ఇండియా కూటమిపై కూడా స్పందించారు. ఈ విషయమై కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. జీరో ప్లస్ జీరో అంటే ఏంటి అని ప్రశ్నించారు. ఇలా అందరూ కలిసి రావడం ఇదేతొలిసారి కాదని 2017, 2022లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అంతా ఒక్కటయ్యారని, కానీ ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. చాలా మంది ప్రతిపక్ష నాయకులు జైలులో లేదా బెయిల్‌పై ఉన్నారు. అవినీతి రహిత ప్రభుత్వం ఇస్తామని 2014లోనే చెప్పామని, చేసి చూపించామని గర్వంగా చెప్పగలమని మంత్రి చెప్పుకొచ్చారు.
WITT ఈవెంట్ లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..