Pralhad Joshi: కాంగ్రెస్ హైకమాండ్ కనుసన్నల్లోనే స్కామ్.. సీఎం రాజీనామా చేయాలి: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

|

Jul 28, 2024 | 8:09 PM

ముడా కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. పార్లమెంట్ హౌస్ వెలుపల జోషి మీడియాతో మాట్లాడారు.

Pralhad Joshi: కాంగ్రెస్ హైకమాండ్ కనుసన్నల్లోనే స్కామ్.. సీఎం రాజీనామా చేయాలి: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
Pralhad Joshi
Follow us on

ముడా స్కాం కర్నాటకతో పాటు జాతీయ రాజకీయాలను కుదిపేస్తోంది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ – ముడాలో భూములు కోల్పోయిన వారికి సైట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని.. 4వేల కోట్ల కుంభకోణం దీనివెనుక దాగి ఉందని బీజేపీ ఆరోపిస్తోంది.. దీనిపై అసెంబ్లీ వేదికగా గళం విప్పింది.. స్వయంగా సీఎం సిద్ధరామయ్య భార్యకు అప్పనంగా భూములు ఇచ్చేశారంటూ బీజేపీ ఆరోపిస్తోంది.. ఇదిలాఉంటే.. ముడా స్కాం ఆరోపణలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం రిటైర్డ్‌ జడ్జ్‌తో విచారణకు ఆదేశించింది. పీఎన్‌ దేశాయ్‌ నేతృత్వంలో ఈ విచారణ జరుగుతుందని.. ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో.. ముడా కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. పార్లమెంట్ హౌస్ వెలుపల జోషి మీడియాతో మాట్లాడారు. ఈ కుంభకోణంలో నేరుగా ముఖ్యమంత్రి ప్రమేయం ఉందని, కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన ఆరోపించారు.

నీతి ఆయోగ్ సమావేశం తరువాత.. ఈ రోజు విద్యారంగానికి సంబంధించిన తదుపరి కార్యక్రమాన్ని ఎలా రూపొందించాలో వివరంగా చర్చించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముడా స్కామ్ పై మాట్లాడుతూ కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు.. ఇది అతిపెద్ద కుంభకోణం.. దీనిలో ముఖ్యమంత్రి.. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ప్రత్యక్ష ప్రమేయం ఉందన్నారు. రెండు పెద్ద కుంభకోణాలు జరిగాయని.. కాంగ్రెస్ నేతలు లోక్‌సభ ఎన్నికల కోసం డబ్బును బదిలీ చేశారని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ హైకమాండ్‌ ఆదేశాలతో పూర్తి అవగాహనతో జరిగిందని.. దీనిపై రాహుల్ గాంధీకి కూడా పూర్తి అవగాహన ఉందంటూ పేర్కొన్నారు.

మరోవైపు నీతి ఆయోగ్ సమావేశాన్ని కాంగ్రెస్, ఇండి కూటమి ముఖ్యమంత్రులు బహిష్కరించడాన్ని కూడా ఖండిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..