Kishan Reddy: ఇది దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడమే.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్

అంతర్జాతీయ స్థాయి AI సమ్మిట్ సందర్భంగా కాంగ్రెస్ నిరసనలపై కేంద్ర కోల్ & మైన్స్ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దేశం గ్లోబల్ టెక్నాలజీ శక్తిగా ఎదుగుతున్న వేళ సమ్మిట్ వేదికను భంగం కలిగించడం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

Kishan Reddy: ఇది దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడమే.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్
Kishan Reddy

Updated on: Feb 20, 2026 | 7:04 PM

కేంద్ర కోల్ & మైన్స్ మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు చేశారు. దేశం గ్లోబల్ టెక్నాలజీ శక్తిగా ఎదుగుతున్న సమయంలో జరిగిన అంతర్జాతీయ స్థాయి AI సమ్మిట్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు భంగం కలిగించారని ఆయన ఆరోపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించే వేదికగా నిలిచిన ఈ సమ్మిట్‌లో వినూత్న ఆవిష్కరణలు, గిన్నిస్ వరల్డ్ రికార్డులు వంటి అంశాలు దేశ ప్రతిష్ఠను పెంచాయని మంత్రి తెలిపారు. అయితే అదే సమయంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన పేరుతో అల్లర్లు సృష్టించారని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. కొందరు కార్యకర్తలు సమ్మిట్ వద్ద అర్థనగ్నంగా నిరసన తెలపడం అంతర్జాతీయ వేదికపై దేశ ఇమేజ్‌కు భంగం కలిగించిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో విభేదాలు సహజమని, నిరసనలు అవసరమని ఆయన అంగీకరించారు. కానీ ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమంలో దేశ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరించడం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. రాజకీయ లాభాల కోసం దేశాన్ని ప్రపంచ వేదికపై చిన్నబుచ్చే చర్యలు చేయకూడదని మంత్రి స్పష్టం చేశారు. దేశాభివృద్ధిని ప్రతిబింబించే ఇటువంటి కార్యక్రమాల్లో హుందాతనం ప్రదర్శించాల్సింది పోయి, రచ్చ చేయడంపై కిషన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, దేశ గౌరవం ముడిపడి ఉన్న వేదికలను కాంగ్రెస్ ఇందుకు వాడుకోవడంపై పలువురు నిపుణులు సైతం తప్పు పడుతున్నారు.

Follow Us