కొరొనిల్ ని కేంద్ర మంత్రి ఆమోదించలేదు, ఐఎంఏ అభ్యంతరంపై పతంజలి సంస్థ వివరణ

| Edited By: Anil kumar poka

Feb 24, 2021 | 11:17 AM

వివాదాస్పదమైన పతంజలి సంస్థ వారి కొరొనిల్ విషయంలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎం ఏ) తప్పు పట్టడంపట్ల ఈ సంస్థ స్పందించింది.

కొరొనిల్ ని కేంద్ర మంత్రి ఆమోదించలేదు, ఐఎంఏ అభ్యంతరంపై పతంజలి సంస్థ వివరణ
Follow us on

వివాదాస్పదమైన పతంజలి సంస్థ వారి కొరొనిల్ విషయంలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎం ఏ) తప్పు పట్టడంపట్ల ఈ సంస్థ స్పందించింది. దీన్ని ఆమోదిస్తున్నట్టు హర్షవర్ధన్ ప్రకటించలేదని, అసలు ఏ ఆయుర్వేద ఔషధాన్నీఆయన  ఎండార్స్ చేయలేదని పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఆచార్య బాలకృష్ణ స్పష్టం చేశారు. కొరొనిల్ విషయంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి సర్టిఫికెట్ లభించిందని యోగాగురు బాబా రామ్ దేవ్ పేర్కొన్నారని ఆయన అన్నారు. పైగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ మందునూ ఆమోదించదని, అలాగే దేన్నీ తిరస్కరించదని  ఆయన పునరుద్ఘాటించారు.  కొరొనిల్ ను  తాము రివ్యూ చేయలేదని, కోవిడ్ చికిత్సకు ఇది తోడ్పడుతుందని చెప్పే ఏ ఔషధానికీ తాము సర్టిఫికెట్ ఇవ్వలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన సంగతి విదితమే. తమ మందుకు  భారత డీజీసీఐ  నుంచి ‘కాప్’ సర్టిఫికెట్ లభించిందన్న విషయాన్నీ కూడా ఆయన గుర్తు చేశారు. ఈ అంశంపై ఎలాంటి అయోమయానికి తావులేదన్నారు.

కాగా ;కొరొనిల్ మందు అశాస్త్రీయమైనదని, దీనిని  ఆరోగ్య శాఖ  మంత్రి   హర్షవర్ధన్ ఎలా ఆమోదిస్తారని, ఎలా ప్రమోట్ చేశారని, ఈ దేశానికి ఆయన సంజాయిషీ ఇవ్వాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల డిమాండ్ చేసింది. ఈ మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో కొరొనిల్ ని కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, నితిన్ గడ్కరీ సమక్షంలో బాబా రామ్ దేవ్ దీన్ని విడుదల చేశారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

Fight Video : యూపీ లో పానీ పూరి కస్టమర్లు కోసం కుమ్ములాట..!

Lions scared of Deer Viral Video: సింహాలకు ఎదురెళ్లిన జింక..తర్వాత ఏం జరిగిందో మీరే చుడండి.