AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: ప్రతి ఇంట్లో రామజ్యోతి వెలిగించాలి.. దేశ ప్రజలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి

అయోధ్యతో పాటు దేశం మొత్తం శ్రీరామ నామస్మరణతో మార్మోగుతోంది. పల్లె నుంచి నగరానికి కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. శ్రీరామ ప్రాణ ప్రతిష్ట రోజున మరో దీపావళి జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీపావళి వేడుకలు ప్రారంభించారు.

Ayodhya: ప్రతి ఇంట్లో రామజ్యోతి వెలిగించాలి.. దేశ ప్రజలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి
Minister Dharmendra Pradhan
Balaraju Goud
|

Updated on: Jan 21, 2024 | 9:58 PM

Share

ఆధ్మాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అత్యద్భుత నిర్మాణ శైలితో.. అయోధ్య రామమందిరం ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. జనవరి 22న రామ్‌లల్లా విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవానికి..రామభక్తులు తరలివస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదు ప్రారంభోత్సవానికి సిద్ధమైన రామ్‌ మందిర్‌లో ప్రత్యేక క్రతువులు కొనసాగుతున్నాయి.

శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకుని అయోధ్యలో ప‌లు ప్రత్యేక కార్యక్రమాలు భ‌క్తులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అయోధ్య ప్రత్యేక శోభ‌ను సంత‌రించుకోనుంది. అలయ ప్రారంభోత్సవం అనంతరం సోమవారం సాయంత్రం పది లక్షల దీపాలతో అయోధ్య నగరాన్ని అలంకరించనున్నట్లు రామ జన్మభూమి ట్రస్టు తెలిపింది. అందు కోసం దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలనే ఉపయోగించనున్నట్లు పేర్కొంది. రామ మందిరం సహా రామ్‌ కీ పైడీ, కనక్‌ భవన్‌, గుప్తర్‌ ఘాట్‌, సరయు ఘాట్‌, లతా మంగేష్కర్‌ చౌక్‌, మనిరామ్‌ దాస్‌ చవానీ వంటి ప్రముఖ ప్రదేశాలన్నింటినీ దీపాలతో అలంకరించన్నారు.

అయోధ్యతో పాటు దేశం మొత్తం కూడా శ్రీరామ నామస్మరణతో మార్మోగుతోంది. పల్లె నుంచి నగరానికి కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. మంగళవారం మరో దీపావళి జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీపావళి వేడుకలు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X వేదికగా అనేక చిత్రాలను షేర్ చేశారు. ఒడిశాలోని సంబల్‌పూర్‌లో మట్టి ప్రమిదలను తయారు చేసే కార్మికులతో కలిసి దీపాలను ప్యాక్ చేస్తూ కనిపించారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.

దేశవ్యాప్తంగా విశ్వాస దీపాన్ని వెలిగిస్తానని, మరొక దీపావళిని ఆడంబరంగా, ప్రదర్శనతో జరుపుకుంటానని కేంద్ర మంత్రి ట్విట్టర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కేంద్ర మంత్రి ప్రమిదలను తయారు చేస్తూ, దీపం ఒత్తులను చుట్టూ కనిపించారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తోపాటు పెద్ద సంఖ్యలో మహిళా కార్మికులు వత్తులు తయారు చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా సంబల్పూర్ వచ్చారు. అయోధ్యలో కొత్త విమానాశ్రయంతో సహా అనేక అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట రోజున తమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట జరుపుకునేటప్పుడు ప్రతి ఇంట్లో రామజ్యోతి వెలిగించి దీపావళి జరుపుకోవాలన్నారు.

మరోవైపు ప్రాణప్రతిష్ఠ ళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సోమవారం సాయంత్రం తమ ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో దీపాలు వెలిగించాలని ఇప్పటికే ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 140 కోట్ల మంది దేశప్రజలకు ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తున్నాను అని అయోధ్యలో ప్రధాని చెప్పారు. ప్రధాని మోడీ చేసిన ఈ విజ్ఞప్తి తర్వాత దేశం మొత్తం సంతోషం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ప్రతి కూడలిలో కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం గత ఏడేళ్లుగా అయోధ్యలో దీపోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జనవరి 22న ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనుంది..