Delhi Services Bill: కేజ్రీవాల్ చీకటి ప్రణాళికలను సభలో ఓడించాం.. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు ఆమోదంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు..

|

Aug 08, 2023 | 8:25 AM

Minister Dharmendra Pradhan: ఢిల్లీ సర్వీసెస్ బిల్లును రాజ్యసభ ఆమోదం పొందడంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశ రాజధాని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన చీకటి ప్రణాళికలను సభలో ఓడించారని అన్నారు. షా ప్రసంగంలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు ప్రాముఖ్యతను పొందుపరచడమే కాకుండా మణిపూర్ అంశంపై ప్రతిపక్షాల అబద్ధాలు, మోసాన్ని కూడా బట్టబయలు చేసిందని కేంద్ర మంత్రి అన్నారు. నల్ల కుబేరుల వ్యూహాలు సభలో ఓడిపోయాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభివర్ణించారు.

Delhi Services Bill: కేజ్రీవాల్ చీకటి ప్రణాళికలను సభలో ఓడించాం.. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు ఆమోదంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు..
Dharmendra Pradhan
Follow us on

ఢిల్లీ సర్వీసెస్ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడం పట్ల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీ ప్రజలకు అభినందనలు తెలిపారు. లోక్‌సభ ఆమోదించిన తర్వాత ఢిల్లీ సర్వీసెస్ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందిందని తెలిపారు. ఈ బిల్లు ఢిల్లీ ప్రగతిని, దేశ రాజధానిగా ఢిల్లీ ప్రజలను బలోపేతం చేయబోతోందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజల హక్కులను కొల్లగొట్టి కోట్లాది  రూపాయలతో సొంత భవనాన్ని నిర్మించుకున్న కేజ్రీవాల్ ప్రభుత్వ నల్ల కుబేరుల వ్యూహాలు సభలో ఓడిపోయాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభివర్ణించారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన చీకటి ప్రణాళికలను సభలో ఓడించారని అన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ఢిల్లీ సర్వీస్ బిల్లుపై మాట్లాడుతూ.. తన ప్రసంగంలో ఈ బిల్లు ప్రాముఖ్యతను దేశ ప్రజలతో పంచుకోవడమే కాకుండా.. దీనితో పాటు, మణిపూర్ అంశంతో సహా ప్రతిపక్షాల ప్రతి అబద్ధపు ప్రచారం, ఫోర్జరీ కూడా నాశనం చేయబడింది. అడుగడుగునా ప్రలోభపెట్టే అబద్ధాలతో దేశప్రజలను దోచుకున్న ఈ అవినీతిపరులంతా ఖచ్చితంగా కొత్త ముసుగు వేసుకున్నారని.. అయితే తంత్రం మాత్రం మారలేదని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు.

బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయన్నారు. అహంకారం ముందు దేశ గౌరవం, సభ గౌరవం, విశ్వాసం గురించి విపక్షాలు పట్టించుకోవడం లేదని సభా కార్యక్రమాల్లో మరోసారి స్పష్టమైందన్నారు. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది. అదే సమయంలో, రాజ్యసభలో ఓటింగ్ జరిగినప్పుడు, బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు, ప్రతిపక్షంగా 102 ఓట్లు వచ్చాయన్నారు.

ప్రధాన్ మరో ట్వీట్‌లో రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగాన్ని హైలైట్ చేశారు. షా ప్రసంగంలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు ప్రాముఖ్యతను పొందుపరచడమే కాకుండా మణిపూర్ అంశంపై ప్రతిపక్షాల అబద్ధాలు, మోసాన్ని కూడా బట్టబయలు చేసిందని కేంద్ర మంత్రి అన్నారు.

కేజ్రీవాల్ బ్లాక్ డే ఆఫ్ హిస్టరీ అన్నారు

ఈ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తర్వాత మోదీ ప్రభుత్వాన్ని ఆప్ అధినేత కేజ్రీవాల్ టార్గెట్ చేశారు. సోమవారం (ఈ బిల్లు ఆమోదం పొందిన రోజు) భారతదేశ చరిత్రలో బ్లాక్ డేగా ఆయన అభివర్ణించారు. ఈ బిల్లును ఢిల్లీ ప్రజలను బానిసలుగా మార్చే బిల్లు అని కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. 75 ఏళ్ల తర్వాత నేడు మోదీ స్వాతంత్య్రాన్ని హరించారని.. ఢిల్లీ ప్రజల ఓటుకు విలువ లేదన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం