జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన పునర్విభజన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. కాంగ్రెస్ ఎంపి ఆధిర్ రంజన్ మాట్లాడుతూ కాశ్మీర్ సమస్య ఐక్యరాజ్యసమితిలో ఉందని, అది అంతర్గత సమస్య ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ రభస సృష్టించారు. కాంగ్రెస్ ఎంపి ఆధిర్ రంజన్ చౌధురి మాట్లాడుతున్నప్పుడు బిజెపి ఎంపిలు గందరగోళం సృష్టించారు.
మరోవైపు ఇప్పటికే ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్, అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్‌ను విభజించారు. దీనిపై రాజ్యసభలో పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగింది. పీడీపీ, ఎన్‌సీ, కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలన్నీ ప్రభుత్వ నిర్ణయానికే తమ మద్దతును ప్రకటించారు.