PM Kisan: ‘పీఎం-కిసాన్’ స్కీమ్.. అనర్హుల నుంచి రూ.335 కోట్ల రికవరీ చేసిన కేంద్రం

|

Dec 07, 2024 | 11:36 AM

రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.

PM Kisan: ‘పీఎం-కిసాన్’ స్కీమ్.. అనర్హుల నుంచి రూ.335 కోట్ల రికవరీ చేసిన కేంద్రం
Lok Sabha
Follow us on

పీఎం-కిసాన్ కార్యక్రమం కింద నగదు ప్రయోజనాలను పొందిన అనర్హుల నుండి రూ. 335 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. PM-కిసాన్ కింద, అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ. 6,000 చొప్పున మద్దతును అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి చొప్పున మూడు సమాన నగదు బదిలీలలో రూ.2,000 చెల్లిస్తోంది. మొదటి వాయిదా చెల్లింపును ఫిబ్రవరి 24, 2019న ప్రారంభించింది నరేంద్ర మోదీ సర్కార్.

రైతులకు ఆర్థికంగా మద్దతిచ్చేందుకు 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఈ స్కీమ్‌లో భాగంగా ఏటా 3 విడతల్లో 2వేల రూపాయల చొప్పున మొత్తం 6వేల రూపాయలను నేరుగా లబ్దిదారుల అకౌంట్స్‌లో జమ చేస్తున్నారు. ఈ పథకం మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. భూమిని కలిగి ఉన్న వ్యవసాయ కుటుంబం ఆదాయ పరిమితి, ఆదాయపు పన్ను చెల్లింపుదారు, ప్రభుత్వ ఉద్యోగి, ఎన్నికైన ప్రతినిధి, నెలవారీ రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న ఎవరైనా వంటి మినహాయింపులకు లోబడి రైతులు పేర్లు నమోదు చేసుకోవచ్చు.

లబ్దిదారుల నమోదు , ధృవీకరణలో పూర్తి పారదర్శకతను కొనసాగిస్తూనే, భారత ప్రభుత్వం ఇప్పటివరకు 18 వాయిదాలలో రూ. 3.46 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి లోక్‌సభలో తన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ పథకం మొదట ట్రస్ట్ ఆధారిత వ్యవస్థపై ప్రారంభించిందని, లబ్ధిదారులను స్వీయ-ధృవీకరణ ఆధారంగా రాష్ట్రాలు నమోదు చేసుకున్నాయని సమాధానం తెలిపింది.

రైతుల ఖాతాలతో 12 అంకెల బయోమెట్రిక్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయడం కూడా కొన్ని రాష్ట్రాలకు సడలించింది. తరువాత, అనర్హులను గుర్తించడానికి పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, ల్యాండ్ రికార్డ్‌ల, ఆదాయపు పన్ను డేటాతో లింక్ చేశారు. వీటికి అనేక సాంకేతిక జోక్యాలు ప్రవేశపెట్టారు. అదనంగా, ఆధార్ ఆధారిత చెల్లింపులు, ఇ-కెవైసితో ​​ల్యాండ్ సీడింగ్ తప్పనిసరి చేసింది కేంద్రం. దీంతో రూ.335 కోట్లు రికవరీ చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్రం సహకారంతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రికవరీని చేశాయని ఆయన లోక్‌సభలో వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసవ ఇక్కడ క్లిక్ చేయండి..