Union Cabinet Decisions: పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (MPLADS) పునరుద్ధరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.నిలిపేసిన ఎంపీ-లాడ్స్ నిధులను పునరుద్ధరిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది నుంచి రూ. 2 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి నిధులను మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి మండలి నిర్ణయించిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించారు. న్యూఢిల్లీలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సమావేశం అనంతరం ఠాకూర్ విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా రూ. 5 కోట్లు ప్రతి ఎంపీకి అందుతాయని ఆయన వెల్లడించారు. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం వీటిని కేటాయించుకోవచ్చన్నారు.
దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ఒక్కో ఎంపీకి రూ. 2 కోట్ల చొప్పున అందనున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు రెండు విడతలుగా ఒక్కో ఎంపీకి ఏడాదికి రూ. 5 కోట్ల చొప్పున నిధులు విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అలాగే, భగవాన్ బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15వ తేదీని ‘జంజాతీయ గౌరవ్ దివస్’గా ప్రకటించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గిరిజన ప్రజల అద్భుతమైన చరిత్ర, సంస్కృతి, విజయాలను జరుపుకోవడానికి, స్మరించుకోవడానికి 15-22 నవంబర్ 2021 నుండి వారం రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించిందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
పెట్రోలు డోపింగ్ కోసం చెరకు నుంచి తీసిన ఇథనాల్ ధరలను 1.28 శాతం పెంచి రూ.63.45కి సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రైతులకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాన్ని వేగవంతం చేయడం మరియు చమురు దిగుమతి బిల్లును తగ్గించడంలో సహాయపడే ప్రభుత్వ లక్ష్యంతో పెంపుదల మద్దతు పొందింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ కింద ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇథనాల్ కొనుగోలు చేసే యంత్రాంగానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సి హెవీ మొలాసిస్‌తో తయారైన ఇథనాల్ ధర లీటరుకు రూ.46.66కు, బి హెవీ మొలాసిస్‌తో తయారైన ఇథనాల్ ధర రూ.59.08కి పెరిగింది.
Cabinet approves mechanism for procurement of ethanol by Public Sector Oil Marketing Companies under Ethanol Blended Petrol program. Price of ethanol from C heavy molasses increased to Rs 46.66/litre; from B heavy molasses increased to Rs 59.08/litre: Union Minister Anurag Thakur pic.twitter.com/8ODAzrx5dJ
— ANI (@ANI) November 10, 2021
దీనితో పాటు, జూట్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ యాక్ట్, 1987 ప్రకారం 2021-22 సంవత్సరానికి జూట్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ రిజర్వేషన్ ప్రమాణాలను కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ అనుమతి లభించిన తర్వాత 100 శాతం ఆహార ధాన్యాలు, 20 శాతం చక్కెరను జ్యూట్ బ్యాగుల్లోనే ప్యాకింగ్ చేస్తామని కేంద్ర మంత్రి ఠాకూర్ తెలిపారు. దీని ప్రకారం 2021-22 సంవత్సరానికి జూట్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ కోసం రిజర్వేషన్ నిబంధనలను కేబినెట్ సవరించింది.దీంతో ఇక నుంచి ఆహారధాన్యాలు, చక్కెరను కచ్చితంగా జూట్ బ్యాగ్‌లలో ప్యాక్ చేయాల్సి ఉంటుంది. జూట్ మిల్లుల్లోని 3,70,000 మంది కార్మికులకు ఉపశమనం కలిగించడానికి చర్యలు తీసుకున్నామని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
100% foodgrains & 20% of sugar to be packed in jute bags as Cabinet approves reservation norms for Jute Packaging Materials for Jute Yr 2021-22 under Jute Packaging Material Act, 1987. Move to bring relief to 3,70,000 workers in jute mills&ancillary units: Union Min Anurag Thakur pic.twitter.com/wVybC76GjD
— ANI (@ANI) November 10, 2021
అలాగే, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రూ. 17,408.85 కోట్ల మద్దతు ధరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2014-15 నుండి 2020-21 వరకు పత్తి సీజన్‌లో అంటే అక్టోబర్ నుండి సెప్టెంబరు వరకు పత్తికి ఎమ్‌ఎస్‌పి ఆప్స్ కింద నష్టాలను భర్తీ చేయడానికి అయ్యే ఖర్చును CCEA ఆమోదించిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.