Madras High Court on domestic violence: మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భార్యల రక్షణకు గృహహింస నిరోధక చట్టం ఉన్నట్టు భర్తలకూ ఓ చట్టం అనేది లేకపోవడం దురదృష్టకరమని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. పి. శశికుమార్ అనే వెటర్నెరీ వైద్యుడు దాఖలు చేసిన రిట్ పిటీషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎస్ వైద్యనాథన్ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన శశికుమార్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఆయన భార్య ఉన్నతాధికారులకు 2020 ఫిబ్రవరి 18న ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు శశికుమార్‌ను విధుల నుంచి తొలగించారు. దీన్ని సవాలు చేస్తూ శశికుమార్ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికే వారి విడాకుల కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే భార్య ఫిర్యాదు చేసిన మరుసటి రోజే వారికి విడాకులు సైతం మంజూరు చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే.. ఇదే విషయాన్ని ప్రస్తావించిన న్యాయమూర్తి.. శశికుమార్ భార్య దురుద్దేశంతోనే ఈ రకమైన కంప్లైంట్ ఇచ్చిందని స్పష్టమవుతోందంటూ వ్యాఖ్యానించారు. విడాకులు ఖాయమని అర్థమైన తరువాతే సదరు మహిళ శశికుమార్‌ను ఇబ్బంది పెట్టేందుకు ఇలా ఫిర్యాదు చేసిందని.. ఇది స్పష్టంగా అర్థమవుతోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. వ్యక్తుల జీవితంలో వివాహానికి ఎంతో పవిత్రత ఉందని అయితే.. గృహహింస చట్టం కారణంగా సహజీవనానికి కూడా చట్టబద్ధత లభించిందని.. దీని కారణంగా పవిత్రత అనే పదానికి అర్థం లేకుండా పోయిందని న్యాయమూర్తి వైద్యానథన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా.. శశికుమార్‌ను 15 రోజుల్లోగా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
Also Read: