శివసేన విమర్శలకు చెక్‌ పెట్టిన సోనూసూద్..!

| Edited By:

Jun 08, 2020 | 8:27 AM

లాక్‌డౌన్‌ వేళ అష్టకష్టాలు పడుతున్న వలస కార్మికుల పట్ల నటుడు సోనూసూద్ తన ఉదారభావాన్ని చాటుకున్న విషయం తెలిసిందే.

శివసేన విమర్శలకు చెక్‌ పెట్టిన సోనూసూద్..!
Follow us on

లాక్‌డౌన్‌ వేళ అష్టకష్టాలు పడుతున్న వలస కార్మికుల పట్ల నటుడు సోనూసూద్ తన ఉదారభావాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. వేలాది మంది వలస కార్మికులను వారి స్వగ్రామాలకు పంపిన సోనూ.. వారి పట్ల రియల్ హీరోగా వెలుగొందుతున్నారు. అయితే సోనూ చేస్తున్న ఈ సాయంపై శివసేన రాజకీయ చురకలు అంటించింది. బీజేపీ చేతిలో సోనూ ఓ కీలుబొమ్మ అంటూ శివసేన నేత సంజయ్‌ రౌత్ ఆరోపించారు. ఈ మేరకు ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో లాక్‌డౌన్ వేళ కొత్త మహాత్ముడు పుట్టుకొచ్చారంటూ సోనూపై వ్యంగాస్త్రాలు విసిరారు. ఇక ఈ విమర్శలన్నింటికి చెక్‌ పెట్టారు సోనూ.

ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను సోనూసూద్ కలిశారు. ఈ సమావేశంలో ఉద్ధవ్ థాకరే తనయుడు, పర్యాటక శాఖ ఆదిత్య థాకరే కూడా ఉన్నారు. దీంతో తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదంటూ ఓ సంకేతం ఇచ్చారు సోనూ. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై మాట్లాడుకోగా.. సోనూపై ఉద్ధవ్ థాకరే ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశంపై సోనూసూద్ మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే థాకరేను కలిశానని అన్నారు. కాగా సోనూసూద్ చేస్తోన్న సాయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే శివసేన ఆయనకు రాజకీయ మరక అంటించడంపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

Read This Story Also: విమర్శలపై ఆవేదన.. కంటతడి పెట్టిన స్పీకర్