Watch Video: హలీవుడ్ సినిమాను తలపించే సీన్.. అందరూ చూస్తుండగానే కుప్పకూలిన భారీ వంతెన, వీడియో వైరల్

|

Jun 04, 2023 | 9:59 PM

బిహార్‌లోని నిర్మాణంలో ఉన్న ఓ భారీ వంతెన కూలిపోవడం కలకలం రేపింది. ఖగారియా జిల్లాలోని గంగా నదిపైన నిర్మిస్తున్న నాలుగు లెన్ల అగువాని-సుల్తాన్ గంజ్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం 6.గంటలకు అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా నదిలో కుప్పకూలింది.

Watch Video: హలీవుడ్ సినిమాను తలపించే సీన్.. అందరూ చూస్తుండగానే కుప్పకూలిన భారీ వంతెన, వీడియో వైరల్
Bridge Collapse
Follow us on

బిహార్‌లోని నిర్మాణంలో ఉన్న ఓ భారీ వంతెన కూలిపోవడం కలకలం రేపింది.  భగల్పూర్ జిల్లాలోని గంగా నదిపైన నిర్మిస్తున్న నాలుగు లెన్ల అగువాని-సుల్తాన్ గంజ్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం 6.గంటలకు అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా నదిలో కుప్పకూలింది. సుల్తాన్‌గంజ్-ఖాగారియా జిల్లాలను కలపుతూ 2014లో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఈ వంతెన కూలిపోవడం ఇది రెండోసారి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటినా స్థానిక అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు.

వంతెన కూలిపోతుండగా అక్కడున్న స్థానికులు ఫోన్లలో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇదిలా ఉండగా ఈ వంతె నిర్మాణం కోసం బిహార్‌ ప్రభుత్వం రూ.1,717 కోట్లు కేటాయించింది. ఈ ఘటనపై స్పందించిన బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ విచారణకు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం